Moto G56 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? పిచ్చెక్కించే ఫీచర్లతో మోటో G56 5G ఫోన్ వచ్చేస్తోంది.. ధర మీ బడ్జెట్‌లోనే..!
Moto G56 5G : రాబోయే మోటో G56 లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధర, ఇతర వివరాల గురించి ఓసారి లుక్కేయండి.

Moto G56 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మోటోరోలా అభిమానుల కోసం అతి త్వరలో మోటో G56 5G ఫోన్ (Moto G56 5G) రానుంది. ఈ మోటో 5G ఫోన్ మోటరోలా చెక్, స్లోవాక్ వెబ్‌సైట్‌లలో కనిపించింది.
Read Also : Android Camera Phones : ఐఫోన్ ఎందుకు భయ్యా.. ఈ 6 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు ఉండగా.. ఫొటో క్వాలిటీ కేక..!
మోటో G56 5G లాంచ్ తేదీ, కీలక ఫీచర్లు ఇప్పటికే రివీల్ అయ్యాయి. గత ఏడాదిలో వచ్చిన మోటో G55 తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది.
మోటో G56 లాంచ్ తేదీ :
నివేదికల ప్రకారం.. మోటో G56 ఫోన్ మే 29న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. భారత మార్కెట్లో లాంచ్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. మోటోరోలా మోటో G55ని ఇంకా లాంచ్ చేయలేదు. మోటో G56 కూడా ఇప్పట్లో లాంచ్ అయ్యే అవకాశం లేదు.
మోటో G56 5G స్పెసిఫికేషన్లు :
మోటో G56 ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7060తో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ కలిగి ఉండనుంది. SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు.
ఈ మోటో ఫోన్ 50MP సోనీ లైటియా LYT-600 ప్రైమరీ రియర్ కెమెరా సెన్సార్, ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 30W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,200mAh బ్యాటరీతో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో వస్తుంది.
మోటో G56 ఫోన్ 87శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను అందిస్తుంది. గొరిల్లా గ్లాస్ 7i స్క్రీన్ ప్రొటెక్షన్, MIL-STD 810H రగ్డ్ హౌసింగ్ ఉండొచ్చు. 1.2 మీటర్ల వరకు డ్రాప్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది.
ఈ ఫోన్‌లో FHD+ రిజల్యూషన్‌తో 6.72-అంగుళాల LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్ కూడా ఉంటుందని అంచనా. ఆండ్రాయిడ్ 15-ఆధారిత హలో యూఐలో రన్ కావచ్చు.
కలర్ ఆప్షన్లు ఇవే :
నివేదికల ప్రకారం.. పాంటోన్, డాజెలింగ్ బ్లూ, పాంటోన్ డిల్, పాంటోన్ గ్రే మిస్ట్, పాంటోన్ బ్లాక్ ఓస్టర్ అనే 4 కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ ఫోన్ ప్రాసెసర్, బ్యాటరీ, ఛార్జింగ్ కెపాసిటీ కూడా రివీల్ అయ్యాయి.
మోటో G56 5G ధర (అంచనా) :
మోటో G56 5G ఫోన్ 8GB + 256GB కాన్ఫిగరేషన్ ధర సుమారు రూ. 24వేలు ఉంటుందని అంచనా.