WhatsApp iPad : పండగ చేస్కోండి.. ఐప్యాడ్ యూజర్ల కోసం వాట్సాప్ వచ్చేసిందోచ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!
WhatsApp iPad : ఐప్యాడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ స్పెషల్ అప్లికేషన్ రిలీజ్ అయింది. ఇంతకీ ఈ కొత్త యాప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

WhatsApp iPad
WhatsApp iPad : ఐప్యాడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ ఇకపై ఐప్యాడ్ లోనూ అందుబాటులో ఉంటుంది. చాలా ఏళ్లుగా ఐప్యాడ్ యూజర్లు వాట్సాప్ యాక్సస్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఎట్టకేలకు ఐప్యాడ్ యూజర్ల కోసం స్పెషల్ యాప్ రిలీజ్ చేసింది. ఈ యాప్ ద్వారా టాబ్లెట్ డివైజ్‌ల్లో మెసేజింగ్, కాలింగ్ ఫీచర్‌లను వినియోగించుకోవచ్చు. ఐప్యాడ్ యూజర్లు వాట్సాప్ యాప్ ద్వారా 32 మంది వరకు వీడియో, ఆడియో కాల్స్ చేయవచ్చు.
అలాగే స్క్రీన్ షేరింగ్, ఫ్రంట్, బ్యాక్ కెమెరాలను ఉపయోగించవచ్చు. ఇప్పటికే వాట్సాప్ కాంటాక్ట్‌లతో బిగ్ ఇంటర్‌ఫేస్ ద్వారా కమ్యూనికేషన్‌ను అందించాలని మెటా సొంత యాప్ భావిస్తోంది. ఈ యాప్ స్టేజ్ మేనేజర్, స్ప్లిట్ వ్యూ, స్లయిడ్ ఓవర్ వంటి iPadOS మల్టీ టాస్కింగ్ ఫీచర్లకు కూడా సపోర్టు ఇస్తుంది.
వినియోగదారులు ఇతర అప్లికేషన్లతో పాటు వాట్సాప్ కూడా ఒకేసారి వినియోగించవచ్చు. ఈ కొత్త అప్లికేషన్ ఆపిల్ పెన్సిల్, మ్యాజిక్ కీబోర్డ్ వంటి అప్లియన్సెస్ కూడా సపోర్టు చేస్తుంది. ఐప్యాడ్ యూజర్లు వాట్సాప్ ద్వారా అన్ని యాప్‌లను యాక్సస్ చేయొచ్చు.
మీరు వెబ్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు మెసేజ్ పంపవచ్చు లేదా కాల్ సమయంలో గ్రూప్ ట్రిప్ కోసం ఆప్షన్లను సెర్చ్ చేయొచ్చు. వాట్సాప్ మ్యాజిక్ కీబోర్డ్, ఆపిల్ పెన్సిల్‌తో కూడా రన్ అవుతుంది.
ఈ యాప్ వాట్సాప్ మల్టీ డివైజ్ ఫీచర్ సపోర్టు ఇస్తుంది. ప్రైమరీ ఫోన్‌తో లింక్ చేయాల్సిన పని ఉండదు. మీ అన్ని చాట్స్, డేటా, మీడియాను మీ ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ అంతటా సింకరైజ్ చేస్తుంది. వినియోగదారులు చాట్ లాక్ ద్వారా తమ చాట్‌లను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
Read Also : Motorola Razr 60 : మోటోరోలా మడతబెట్టే ఫోన్ కావాలా? ఈ వారమే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?
ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? :
ఆపిల్ ఐప్యాడ్ యూజర్లు ఇప్పుడు యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాబోయే వారాల్లో, కంపెనీ కొత్త అప్‌డేట్స్, ఫీచర్లను రిలీజ్ చేయనుంది. అయితే, కంపెనీ ఇంకా కచ్చితమైన రిలీజ్ షెడ్యూల్ లేదా ఫీచర్ వివరాలను వెల్లడించలేదు.