IPL 2025 : మిచెల్ మార్ష్ అద్భుత సెంచరీ.. గుజరాత్‌‌‌పై లక్నో విజయం..

IPL 2025 : లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ జెయింట్స్‌ను 33 పరుగుల తేడాతో ఓడించింది. మిచెల్ మార్ష్ సెంచరీతో రాణించాడు.

LSG vs GT : Photo Credit (IPLT20.com/©BCCI )

IPL 2025 : ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ ‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read Also : Motorola Razr 60 : మతిపోగొట్టే ఫీచర్లతో మోటోరోలా మడతబెట్టే ఫోన్ వస్తోంది.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 235 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్‌కు నిర్దేశించింది. కానీ, గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులకే చేతులేత్తేసింది.

టాస్ ఓడి లక్నో ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ మిచెల్ మార్ష్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టు భారీ స్కోరును అందించాడు. లక్నో తరఫున 64 బంతుల్లో 117 పరుగులతో సెంచరీ పూర్తి చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నికోలస్ పూరన్ కూడా (56) హాఫ్ సెంచరీతో రాణించాడు.

గుజరాత్ టైటాన్స్ 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక విఫలమైంది. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్ 46 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

కానీ, సాయి సుదర్శన్ 5వ ఓవర్‌లో 21 పరుగులకే అవుట్ అయ్యాడు. జోస్ బట్లర్‌ 33 పరుగులు చేసి ఔట్ కాగా, శుభ్‌మాన్ గిల్ 20 బంతుల్లో 35 పరుగులు చేసి ఔటయ్యాడు.

Read Also : Vodafone Idea : Vi యూజర్లకు పండగే.. 3 కొత్త గేమ్ ఛేజింగ్ అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్లు ఇవే.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

లక్నో బౌలర్లలో విలియం రూర్క్ మూడు వికెట్లు, ఆయుష్ బదోని, అవేశ్ ఖాన్ రెండు వికెట్లు, ఆకాశ్‌ మహరాజ్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు. గుజరాత్‌ బౌలర్లలో అర్షద్‌, సాయికిశోర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.