DC vs RR : రాజ‌స్థాన్‌, ఢిల్లీ హెడ్‌-టు-హెడ్‌.. పిచ్ రిపోర్ట్‌.. ఇంకా..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధ‌మైంది.

IPL 2025 Match 32 RR vs DC Match Prediction

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధ‌మైంది. బుధ‌వారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌నుంది.

ఈ సీజ‌న్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఢిల్లీ విజ‌యం సాధించింది. అయితే.. ఐదో మ్యాచ్‌లో ముంబై ఆ జ‌ట్టుకు షాకిచ్చింది. గ‌త మ్యాచ్‌లో ముంబై చేతిలో ఢిల్లీ ఓడిపోయింది. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. ర‌న్‌రేట్ +0.899గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో కొన‌సాగుతోంది. రాజ‌స్థాన్ పై గెలిచి మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టాల‌ని ఢిల్లీ భావిస్తోంది.

PBKS vs KKR : ఆన్ ఫీల్డ్ గేజ్ పరీక్షలో విఫ‌ల‌మైన కోల్‌క‌తా ప్లేయ‌ర్ అన్రిచ్ నోర్ట్జే బ్యాట్‌.. అంపైర్లు ఏం చేశారో తెలుసా?

మ‌రోవైపు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌స్థాన్ ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. నెట్‌ర‌న్‌రేట్ -0.838గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది. గ‌త రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన రాజ‌స్థాన్ ఢిల్లీతో మ్యాచ్‌లో గెలిచి విజ‌యాల బాట ప‌ట్టాల‌ని చూస్తోంది.

హెడ్‌-టు-హెడ్‌..

ఐపీఎల్‌లో ఇప్ప‌టి ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు 29 సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలుపొందింది. మ‌రో 15 మ్యాచ్‌ల్లో రాజ‌స్థాన్ విజ‌యం సాధించింది.

పిచ్ రిపోర్ట్..

న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటర్లకు స్వర్గధామం అని చెప్ప‌వ‌చ్చు. ఔట్ ఫీల్డ్ వేగంగా ఉంటుంది. ఇరు జ‌ట్ల‌లోనూ బిగ్ హిట్ట‌ర్‌లు ఉండ‌డంతో భారీ స్కోర్‌లు న‌మోదు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

PBKS vs KKR : శ్రేయ‌స్ అయ్య‌ర్ ముందు కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌ను అవ‌మానించిన అజింక్యా ర‌హానే..! గ‌ట్టిగానే హ‌ర్ట్ అయ్యాడుగా..!

తుది జ‌ట్ల అంచ‌నా..

ఢిల్లీ క్యాపిటల్స్..
అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్/జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్‌), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కులదీప్ యాదవ్, ముఖేష్ కుమార్

ఇంపాక్ట్ ప్లేయర్.. కరుణ్ నాయర్

రాజస్థాన్ రాయల్స్..
సంజు శాంసన్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, నితీష్ రాణ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే
ఇంపాక్ట్ ప్లేయర్.. కుమార్ కార్తికేయ

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌కు అరుదైన గౌర‌వం..