Rohit Sharma : రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..
టీమ్ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనుంది.

MCA names a Wankhede Stadium stand after India captain Rohit Sharma
టీమ్ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనుంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలోని ఓ స్టాండ్‌కు అతడి పేరు పెట్టనున్నారు. మంగళవారం నిర్వహించిన అసోసియేషన్ వార్షిక సర్వసభ్యసమావేశంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. హిట్‌మ్యాన్ పేరుతో పాటు మరో రెండు స్టాండ్లకు దివంగత క్రికెటర్ అజిత్ వాడేకర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్లను పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది.
దివేచా పెవిలియన్ లెవల్-3కి రోహిత్ పేరు, గ్రాండ్‌స్టాండ్ లెవల్-3కి పవార్, లెవల్-4కి వాడేకర్ పేర్లు పెట్టబోతున్నారు. దేశానికి రెండు ఐసీసీస ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మకు తాము ఇచ్చే గౌరవం ఇది అని ముంబై క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
1966 నుంచి 1974 మధ్యకాలంలో అజిత్ వాడేకర్ టీమ్ఇండియా తరుపున 37 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు. 1971లో వెస్టిండీస్, ఇంగ్లాండ్ పై టెస్టు సిరీస్‌లు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 77 ఏళ్ల వయసులో (2018లో) అజిత్ మృతిచెందారు.
దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సునీల్ గవాస్కర్, విజయ్ మర్చంట్ పేరుతో ఇప్పటికే వాంఖడే స్టేడియంలో స్టాండ్స్ ఉన్నాయి.
PBKS vs KKR : రహానే ఎంత పని చేశావయ్యా.. యువ ఆటగాడి మాటలు నమ్మి.. మోసపోయావ్ గదయ్యా..!