PBKS vs KKR : ర‌హానే ఎంత ప‌ని చేశావ‌య్యా.. యువ ఆట‌గాడి మాట‌లు న‌మ్మి.. మోసపోయావ్‌ గ‌ద‌య్యా..!

ఈ ద‌శ‌లో కేకేఆర్ ఈజీగా గెలుస్తుంద‌ని అంతా భావించారు.

PBKS vs KKR : ర‌హానే ఎంత ప‌ని చేశావ‌య్యా.. యువ ఆట‌గాడి మాట‌లు న‌మ్మి.. మోసపోయావ్‌ గ‌ద‌య్యా..!

Courtesy BCCI

Updated On : April 16, 2025 / 8:00 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుతం చేసింది. అతి త‌క్కువ స్కోరును కాపాడుకుంది. హిట్ట‌ర్ల‌కు కొద‌వ‌లేని కేకేఆర్ జ‌ట్టును 112 ప‌రుగులు చేయ‌కుండా ఆపింది. 95 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసి 16 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. ఓపెన‌ర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్ (30; 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), ప్రియాంశ్‌ ఆర్య (22; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) లు రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 15.3 ఓవర్ల‌లో 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా మూడు వికెట్లు తీశాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సునీల్ న‌రైన్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. వైభ‌వ్ అరోరా, అన్రిచ్ నోర్జే లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

MS Dhoni : చేతికి గ్లోవ్స్ ఉన్నాయని త‌క్కువ అంచ‌నా వేస్తావా.. ఎంఎస్ ధోని ర‌నౌట్ అదుర్స్.. వీడియో వైర‌ల్‌

అనంత‌రం పంజాబ్ బౌల‌ర్లు చాహ‌ల్ నాలుగు వికెట్లు, మార్కో జాన్సెన్ మూడు వికెట్ల‌తో చెల‌రేగ‌డంతో 112 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో కోల్‌క‌తా త‌డ‌బ‌డింది. 15.1 ఓవ‌ర్ల‌లో 95 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో అంగ్క్రిష్ రఘువంశీ (37; 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్ స్కోర్‌.

ర‌హానే ఎంత ప‌ని చేశావ్‌..

స్వ‌ల్ప ల‌క్ష్య ఛేద‌న‌లో కేకేఆర్‌కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. 7 ప‌రుగుల‌కే ఓపెన‌ర్లు సునీల్ న‌రైన్ (2), క్వింట‌న్ డికాక్ (5)లు పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. దీంతో ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్య‌త‌ను కెప్టెన్ అజింక్యా ర‌హానే (17; 17 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), యువ ఆట‌గాడు అంగ్క్రిష్ రఘువంశీ పై ప‌డింది. వీరిద్ద‌రు పంజాబ్ బౌల‌ర్ల పై ఎదురుదాడికి దిగారు.

దీంతో ప‌వ‌ర్ ప్లే ముగిసి సరికి కోల్‌క‌తా స్కోరు 6 ఓవ‌ర్ల‌కు 55/2 గా ఉంది. ఈ ద‌శ‌లో కేకేఆర్ ఈజీగా గెలుస్తుంద‌ని అంతా భావించారు. అయితే.. ఎనిమిదో ఓవ‌ర్‌లో కేకేఆర్‌కు షాక్ త‌గిలింది. చాహ‌ల్ ఎనిమిదో ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని నాలుగో బంతికి ర‌హానే స్వీప్ షాట్ ఆడాడు. అయితే.. బంతి అత‌డి బ్యాట్ ను మిస్సై ప్యాడ్ ను తాకింది.

LSG vs CSK : చెన్నైపై ఓట‌మి.. ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గొయెంకా రియాక్ష‌న్ వైర‌ల్‌ .. మైదానంలో ఉన్న కెప్టెన్ పంత్ ద‌గ్గ‌రికి వ‌చ్చి..

పంజాబ్ ఫీల్డ‌ర్లు ఎల్బీడ‌బ్ల్యూ అంటూ అప్పీల్ చేయ‌గా అంపైర్ ఔట్ ఇచ్చాడు. వెంట‌నే ర‌హానే నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న అంగ్క్రిష్ రఘువంశీ సాయం కోరాడు. డీఆర్ఎస్ తీసుకోవాలా? వ‌ద్దా..? అది ఔటేనా అని అడిగాడు. ఈ యువ ఆట‌గాడు చెప్ప‌డంతో ర‌హానే డీఆర్ఎస్ తీసుకోకుండా నిరాశ‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ఇక రిప్లేలో బంతి ఇంపాక్ట్ ఔట్ సైడ్ లో ప‌డిన‌ట్లుగా తెలిసింది. ఒక‌వేళ ర‌హానే రివ్య్వూ తీసుకుని ఉంటే ఖ‌చ్చితంగా ఔట్ అయ్యేవాడు కాదు. ఇప్పుడు ఇదే విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ర‌హానే ఔట్ కావ‌డంతో వ‌రుస‌గా వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఓడిపోయింది.

అత‌డు డీఆర్ఎస్ తీసుకుని ఉంటే కోల్‌క‌తా ఈజీగా మ్యాచ్ గెలిచేద‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. అయ్యో ర‌హానే యువ ఆట‌గాడి మాట‌లు న‌మ్మి ఇలా ఎలా చేశావ‌య్యా అని అంటున్నారు.

Hardik Pandya : హార్దిక్ పాండ్యా బ్యాట్ చెక్ చేసిన అంపైర్‌.. ఏంద‌ప్పా ఇదీ..

ఇక మ్యాచ్ అనంత‌రం ర‌హానే దీనిపై మాట్లాడుతూ.. ఓట‌మి బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని చెప్పాడు. తాను త‌ప్పు షాట్ ఆడాన‌ని, అయిన‌ప్ప‌టికి అది మిస్సైంద‌న్నాడు. ఆ స‌మ‌యంలో త‌న ఔట్ పై అంగ్క్రిష్ రఘువంశీ ఖ‌చ్చితంగా లేడ‌న్నాడు. అత‌డు అది అంపైర్స్ కాల్ అవుతుందేమోన‌ని చెప్పాడ‌ని తెలిపాడు. ఆ స‌మ‌యంలో తాను ఎలాంటి ఛాన్స్ తీసుకోద‌ల‌చుకోలేద‌న్నాడు. డీఆర్ఎస్ వృథా చేయ‌డం ఇష్టం లేద‌న్నాడు. అందుక‌నే తాను డీఆర్ఎస్ తీసుకోలేద‌న్నాడు.

కాగా.. ర‌హానే, అంగ్క్రిష్ రఘువంశీ వంశీ జోడీ మూడో వికెట్‌కు 55 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.