MS Dhoni : చేతికి గ్లోవ్స్ ఉన్నాయని త‌క్కువ అంచ‌నా వేస్తావా.. ఎంఎస్ ధోని ర‌నౌట్ అదుర్స్.. వీడియో వైర‌ల్‌

ల‌క్నో ఆట‌గాడు అబ్దుల్ స‌మ‌ద్ ర‌నౌట్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

MS Dhoni : చేతికి గ్లోవ్స్ ఉన్నాయని త‌క్కువ అంచ‌నా వేస్తావా.. ఎంఎస్ ధోని ర‌నౌట్ అదుర్స్.. వీడియో వైర‌ల్‌

Courtesy BCCI

Updated On : April 15, 2025 / 9:19 AM IST

చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పినా త‌క్కువే. బ్యాట్‌తోనే కాకుండా వికెట్ కీప‌ర్‌గా ఎన్నో అద్భుత‌మైన క్యాచ్‌లు, స్టంపింగ్‌లు, ర‌నౌట్లు చేయ‌డాన్ని చూశాం. అయితే.. సోమ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అబ్దుల్ స‌మ‌ద్‌ను ధోని ర‌నౌట్ చేసిన విధానం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. స్టంప్స్ వెనుక బంతి అందుకున్న ధోని.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న వికెట్ల‌కు త్రో విసిరి స‌మ‌ద్‌ను ర‌నౌట్ చేశాడు.

ల‌క్నో ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అప్ప‌టికే 11 బంతులు ఆడి రెండు సిక్స‌ర్లు కొట్టి 20 ప‌రుగుల‌తో దూకుడుగా ఆడుతున్నాడు అబ్దుల్ స‌మ‌ద్. ఆఖ‌రి ఓవ‌ర్‌ను మ‌తీషా ప‌తిరాణా వేశాడు. తొలి బంతికి పంత్ సింగిల్ తీయ‌గా రెండో బంతికి స‌మ‌ద్ స్ట్రైకింగ్‌కు వ‌చ్చాడు. రెండో బంతి వైడ్‌గా వెళ్లింది.

MS Dhoni : నాకు ఎందుకు ఈ అవార్డు.. నేనేమంతా గొప్ప‌గా ఆడా.. అదే ఆలోచిస్తున్నా..

దీంతో ఎక్‌ట్రా ప‌రుగు కోసం ల‌క్నో బ్యాట‌ర్లు ప్ర‌య‌త్నించారు. వికెట్ల వెనుకాల ఉన్న ధోని బంతిని అందుకుని చేతికి గ్లోవ్స్ ఉన్న‌ప్ప‌టికి హ్యాండ్ త్రోతో నాన్ స్ట్రైక‌ర్ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌ను ప‌డ‌గొట్టాడు. అప్ప‌టికి స‌మ‌ద్ క్రీజును చేరుకోలేదు. దీంతో అత‌డు ర‌నౌట్ అయ్యాడు.

LSG vs CSK : వ‌రుస‌గా ఐదు మ్యాచ్‌ల్లో ఓట‌ముల త‌రువాత విజ‌యం.. చెన్నై కెప్టెన్ ధోని కామెంట్స్ వైర‌ల్‌.. ఇక‌నైనా జ‌ట్టు..

ర‌నౌట్ అయిన త‌రువాత అబ్దుల్ స‌మద్ రియాక్ష‌న్ చూస్తే.. చేతికి గ్లోవ్స్ పెట్టుకున్న ధోని నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో వికెట్ల ప‌డ‌గొట్ట‌లేడ‌ని భావించాడ‌ని అనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ధోనిని త‌క్కువ అంచ‌నా వేస్తే ఫ‌లితం ఇలాగే ఉంటుంద‌ని కామెంట్లు చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ల‌క్నో మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 166 ప‌రుగులు చేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో రిష‌బ్ పంత్ (63; 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. అనంత‌రం శివ‌మ్ దూబె (43 నాటౌట్; 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ర‌చిన్ ర‌వీంద్ర (37; 22 బంతుల్లో 5 ఫోర్లు), షేక్ ర‌షీద్ (27; 19 బంతుల్లో 6 ఫోర్లు), ఎంఎస్ ధోని (26 నాటౌట్; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించ‌డంతో ల‌క్ష్యాన్ని 19.3 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది.

LSG vs CSK : చెన్నైపై ఓట‌మి.. ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గొయెంకా రియాక్ష‌న్ వైర‌ల్‌ .. మైదానంలో ఉన్న కెప్టెన్ పంత్ ద‌గ్గ‌రికి వ‌చ్చి..