LSG vs CSK : చెన్నైపై ఓటమి.. లక్నో యజమాని సంజీవ్ గొయెంకా రియాక్షన్ వైరల్ .. మైదానంలో ఉన్న కెప్టెన్ పంత్ దగ్గరికి వచ్చి..
చెన్నైతో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన తరువాత లక్నో యజమాని సంజీవ్ గొయెంకా చేసిన పని వైరల్ అవుతోంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేయాలని భావించిన లక్నో సూపర్ జెయింట్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ షాకిచ్చింది. సోమవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో పై చెన్నై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
కెప్టెన్ రిషబ్ పంత్ (63; 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు)ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఫామ్‌లో ఉన్న మార్‌క్రమ్(6), పూరన్(8) విఫలమైన పంత్ హాఫ్ సెంచరీతో రాణించాడు. పంత్ రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (30), ఆయుష్ బదోని (22)లు పర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా, మతీషా పతిరణా చెరో రెండు వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ లు తలా ఓ వికెట్ తీశారు.
MS Dhoni : నాకు ఎందుకు ఈ అవార్డు.. నేనేమంతా గొప్పగా ఆడా.. అదే ఆలోచిస్తున్నా..
అనంతరం లక్ష్యాన్ని చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్ దూబె (43 నాటౌట్; 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (37; 22 బంతుల్లో 5 ఫోర్లు), షేక్ రషీద్ (27; 19 బంతుల్లో 6 ఫోర్లు), ఎంఎస్ ధోని (26 నాటౌట్; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు.
సంజీవ్ గొయెంకా రియాక్షన్ వైరల్..
ఈ మ్యాచ్‌లో లక్నో ఓడిపోవడంతో అందరి దృష్టి లక్నో యజమాని సంజీవ్ గొయెంకా పై పడింది. ఎందుకంటే అతడు లక్నో ఓడిపోయిన సమయంలో కెప్టెన్లతో వ్యవహరించే తీరుపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

Courtesy BCCI
ఈ సీజన్‌లో లక్నో పలు మ్యాచ్‌లు ఓడిపోయిన సమయంలో మైదానంలోనే కెప్టెన్ రిషబ్ పంత్‌తో గొయెంకా సీరియస్‌గా చర్చిస్తూ కనిపించాడు.
ఇక.. చెన్నైతో మ్యాచ్‌లో లక్నో ఓడిపోయినప్పటికి యజమాని సంజీవ్ గొయెంకా నవ్వుతూనే కనిపించాడు. అతడు మైదానంలోకి వచ్చి రిషబ్ పంత్ ను కౌగలించుకున్నాడు. పంత్‌తో సరదాగానే మాట్లాడాడు. ఆ తరువాత ఎంఎస్ ధోనిని కూడా కౌగిలించుకున్నాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జట్టు గెలిచినా, ఓడిపోయినా కెప్టెన్‌కు మద్దతు ఇస్తూ ఉంటే బాగుంటుందని నెటిజన్లు సంజీవ్ గొయెంకాకు సూచిస్తున్నారు.
Congratulations @ChennaiIPL.
A strong comeback with the bat by @RishabhPant17 and a spirited team effort by @LucknowIPL to fight till the end.
Let’s focus on the next game and move forward. On to the following one.#LSG #LSGvsCSK pic.twitter.com/cJRFwbbQv3
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) April 14, 2025
ఇదిలా ఉంటే సంజీవ్ గొయెంకా తన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు. విజయం సాధించిన చెన్నైని అభినందించాడు. రిషబ్ పంత్ ఫామ్‌లోకి రావడం బాగుందన్నాడు. ఆఖరి వరకు పోరాడిన లక్నో టీమ్‌ను అభినందించాడు.