PBKS vs KKR : చాహ‌ల్‌కు ద‌గ్గ‌రికి వెళ్లి ఒక్క‌టే చెప్పా.. లోస్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌క‌తా పై గెలుపు త‌రువాత పంజాబ్ కెప్టెన్ అయ్య‌ర్ కామెంట్స్ వైర‌ల్‌..

లోస్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌క‌తా పై గెల‌వ‌డం పై పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు.

PBKS vs KKR : చాహ‌ల్‌కు ద‌గ్గ‌రికి వెళ్లి ఒక్క‌టే చెప్పా.. లోస్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌క‌తా పై గెలుపు త‌రువాత పంజాబ్ కెప్టెన్ అయ్య‌ర్ కామెంట్స్ వైర‌ల్‌..

Courtesy BCCI

Updated On : April 16, 2025 / 2:00 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ సంచ‌ల‌న విజయాన్ని సాధించింది. కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో 16 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలుత‌ బ్యాటింగ్ చేసింది. 15.3 ఓవర్ల‌లో 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఓపెన‌ర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్ (30; 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), ప్రియాంశ్‌ ఆర్య (22; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) లు రాణించారు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో త‌క్కువ స్కోరుకే ప‌రిమిత‌మైంది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా మూడు వికెట్లు తీశాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సునీల్ న‌రైన్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. వైభ‌వ్ అరోరా, అన్రిచ్ నోర్జే లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో కేకేఆర్ త‌డ‌బ‌డింది. 15.1 ఓవ‌ర్ల‌లో 95 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో అంగ్క్రిష్ రఘువంశీ (37; 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్క‌డే రాణించాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో చాహ‌ల్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మార్కో జాన్సెన్ మూడు వికెట్లు తీశాడు. జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

IPL 2025: టైట్ హగ్ ఇచ్చిన ప్రీతిజింటా.. చాహల్ ఫుల్ హ్యాపీ.. ఎగిరి గంతులేసిన బాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్

ఈ లోస్కోరింగ్ మ్యాచ్‌లో గెల‌వ‌డం పై పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆనందం వ్య‌క్తం చేశాడు. ఈ విజ‌యాన్ని మాటల్లో ఎలా వ‌ర్ణించాలో త‌న‌కు అర్థంకావ‌డం లేద‌న్నాడు.

మ్యాచ్ అనంత‌రం అయ్య‌ర్ మాట్లాడుతూ.. ‘ఈ విజ‌య‌న్ని మాటల్లో వ్యక్తపరచడం కష్టం. బంతి తిర‌గ‌డం గ‌మ‌నించాను. వెంట‌నే చాహ‌ల్ ద‌గ్గ‌రికి వెళ్లి ఒక్క విష‌య‌మే చెప్పాను. శ్వాస కాస్త నియంత్రించుకోమ‌న్నాను. కూల్‌గా ఉండ‌మ‌ని చెప్పాను. కచ్చితత్వంతో బంతు లేసి, మనం బ్యాటర్లను అటాక్‌ చేయాలని సూచించా. ఇప్పుడు మాట‌లు రావ‌డం లేదు. ఇలా గెలిస్తే వాటికి ఉండే కిక్కే వేరు.’ అని అయ్య‌ర్ అన్నాడు.

‘నేను బ్యాటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు.. రెండు బంతుల‌ను మాత్ర‌మే ఎదుర్కొన్నాను. ఒక బంతి చాలా త‌క్కువ ఎత్తులో వ‌చ్చింది. మ‌రో బంతి బ్యాట్ చివ‌ర‌న తాకింది. స్వీప్ చేసేందుకు బ్యాట‌ర్లు ఇబ్బందులు ప‌డ్డారు. దీంతో పిచ్‌లో బౌన్స్ స్థిరంగా లేద‌ని అర్థ‌మైంది. నిజం చెప్పాలంటే మేము మంచి స్కోరు చేశారు. 16 ప‌రుగుల తేడాతో గెలిచాము.’ అని అయ్య‌ర్ చెప్పాడు

PBKS vs KKR : ర‌హానే ఎంత ప‌ని చేశావ‌య్యా.. యువ ఆట‌గాడి మాట‌లు న‌మ్మి.. మోసపోయావ్‌ గ‌ద‌య్యా..!

బౌన్స్ స్థిరంగా లేద‌న్న విష‌యాన్ని బౌల‌ర్లు మ‌న‌సులో ఉంచుకోవాల‌ని చెప్పాను. వారు ప్ర‌ణాళిక‌ల‌ను చాలా చ‌క్క‌గా అమలు చేశారు. మొద‌టి రెండు ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌డంతో మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తామ‌నే న‌మ్మ‌కం వ‌చ్చింది. అజింక్యా, ర‌ఘువంశీ ఇద్ద‌రూ చ‌క్క‌గా బ్యాటింగ్ చేయ‌డంతో విజ‌యం మాకు దూర‌మైన‌ట్లుగా క‌నిపించింది. అయితే.. చాహ‌ల్ వ‌చ్చి మాయ చేశాడు. కోల్‌కతాపై విజయం తర్వాత వినయంగా ఉండాలని జట్టు సభ్యులకు సూచించాను. ఇక ఈ మ్యాచ్‌లో జ‌రిగిన త‌ప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని తదుప‌రి మ్యాచ్‌ల్లో పునరావృతం కాకుండా చూసుకుంటాం అని అయ్య‌ర్ తెలిపాడు.