IPL 2025: టైట్ హగ్ ఇచ్చిన ప్రీతిజింటా.. చాహల్ ఫుల్ హ్యాపీ.. ఎగిరి గంతులేసిన బాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్

మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన ప్రీతి జింటా.. చాహల్ వద్దకు వెళ్లి టైట్ హాగ్ ఇచ్చి తన సంతోషాన్ని వ్యక్తం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

IPL 2025: టైట్ హగ్ ఇచ్చిన ప్రీతిజింటా.. చాహల్ ఫుల్ హ్యాపీ.. ఎగిరి గంతులేసిన బాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్

Preity Zinta hug Yuzvendra Chahal (credit bcci)

Updated On : April 16, 2025 / 8:09 AM IST

Preity Zinta: బాల్ బాల్ కి నరాలు తెగే ఉత్కంఠ.. ఊహించని మలుపులు, బంతి బంతికి బీపీ పెరిగిపోయింది. మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన తీరు ఇది. ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ కు మస్త్ కిక్ ఇచ్చింది. తక్కువ స్కోర్ మ్యాచ్ అయినా కావాల్సినంత మజా దొరికింది. పంజాబ్ ఓటమి ఖాయం అనుకున్న వారంతా మ్యాచ్ ఫలితం తరువాత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు.. పంజాబ్ అద్భుత విజయంతో ఆ జట్టు ఓనర్, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: IPL 2025: పంజాబ్ జట్టుపై ఓటమికి బాధ్యత ఎవరిది..? కేకేఆర్ కెప్టెన్ రహానే కీలక కామెంట్స్..

ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టు ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా.. 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. తక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కేకేఆర్ జట్టు విఫలమైంది. 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది. దీంతో 16 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్ జట్టు స్పిన్నర్ చాహల్ అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. గిరగిరా బంతులతో చకచకా నాలుగు వికెట్లు పడగొట్టి పంజాబ్ సంచలన విజయానికి కారణమయ్యాడు.

Also Read: PBKS vs KKR : ర‌హానే ఎంత ప‌ని చేశావ‌య్యా.. యువ ఆట‌గాడి మాట‌లు న‌మ్మి.. మోసపోయావ్‌ గ‌ద‌య్యా..!

ఇన్నింగ్స్ 8, 10 ఓవర్లలో రహానె, రఘువంశీలను ఔట్ చేసిన చాహల్.. 12వ ఓవర్లో రింకు సింగ్, రమణ్ దీప్ లను ఔట్ చేసి కోల్ కతా జట్టుకు కోలుకోలేని షాకిచ్చాడు. ఓడిపోవటం ఖాయం అనుకున్న మ్యాచ్ లో పంజాబ్ జట్టు అద్భుత విజయాన్ని అందుకోవటంతో ఆ జట్టు ఓనర్ ప్రీతి జింటా సంబరాలు అంబరాన్నంటాయి. స్టాండ్స్ లో ఎగిరి గంతులేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.


నాలుగు కీలక వికెట్లు పడగొట్టి పంజాబ్ జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన యజ్వేంద్ర చాహల్ ను ప్రీతి జింటా అభినందించారు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన ప్రీతి జంటా.. చాహల్ వద్దకు వెళ్లి టైట్ హాగ్ ఇచ్చి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చాహల్ సైతం ఫుల్ హ్యాపీగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి. చాహల్ కు ప్రీతి జింటా టైట్ హాగ్ ఇవ్వడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.. చాహల్ భయ్యా బాలీవుడ్ హీరోయిన్ హాగ్ పట్టేశావ్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.