PBKS vs KKR : శ్రేయ‌స్ అయ్య‌ర్ ముందు కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌ను అవ‌మానించిన అజింక్యా ర‌హానే..! గ‌ట్టిగానే హ‌ర్ట్ అయ్యాడుగా..!

పంజాబ్ కింగ్స్ పై కోల్‌క‌తా ఓడిపోవ‌డంతో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా ర‌హానే బాగా హ‌ర్ట్ అయ్యాడు.

PBKS vs KKR : శ్రేయ‌స్ అయ్య‌ర్ ముందు కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌ను అవ‌మానించిన అజింక్యా ర‌హానే..! గ‌ట్టిగానే హ‌ర్ట్ అయ్యాడుగా..!

pic credit @NGhanekar

Updated On : April 16, 2025 / 12:21 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈజీగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఆ జ‌ట్టు బ్యాట‌ర్లు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేశారు. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స్వ‌ల్ప ల‌క్ష్య ఛేద‌న‌లో పేల‌వ షాట్ల‌తో పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. 112 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కూడా ఛేదించ‌లేక‌పోవ‌డంతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్ అజింక్యా ర‌హానే తీవ్ర నిరాశ‌ చెందాడు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెన‌ర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్ (30; 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), ప్రియాంశ్‌ ఆర్య (22; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) లు రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 15.3 ఓవర్ల‌లో 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా మూడు వికెట్లు తీశాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సునీల్ న‌రైన్‌లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. వైభ‌వ్ అరోరా, అన్రిచ్ నోర్జే లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Zaheer Khan : తండ్రైన టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు జ‌హీర్ ఖాన్‌.. పిల్లాడి పేరేంటో తెలుసా?.. పెళ్లైన ఎనిమిదేళ్ల త‌రువాత

ఆ త‌రువాత చాహ‌ల్ నాలుగు వికెట్లు, మార్కో జాన్సెన్ మూడు వికెట్ల‌తో చెల‌రేగ‌డంతో 112 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో కోల్‌క‌తా త‌డ‌బ‌డింది. 15.1 ఓవ‌ర్ల‌లో 95 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో అంగ్క్రిష్ రఘువంశీ (37; 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో అజింక్యా ర‌హానే కామెంట్స్..

ఈ మ్యాచ్ ఫ‌లితంతో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా ర‌హానే తీవ్ర నిరాశ చెందాడు. ఈ విష‌యం మ్యాచ్ ముగిసిన త‌రువాత ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు క‌ర‌చాల‌నం చేసుకునే స‌మ‌యంలో త‌న ముంబై స‌హ‌చ‌రుడు పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో మాట్లాడే స‌మ‌యంలో స్ప‌ష్టంగా క‌నిపించింది.

“క్యా ఫల్తు బ్యాటింగ్ కరి హమ్నే (మేము ఎంత ద‌రిద్రంగా ఆడామో),” అని రహానే హిందీలో అయ్యర్‌తో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

PBKS vs KKR : చాహ‌ల్‌కు ద‌గ్గ‌రికి వెళ్లి ఒక్క‌టే చెప్పా.. లోస్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌క‌తా పై గెలుపు త‌రువాత పంజాబ్ కెప్టెన్ అయ్య‌ర్ కామెంట్స్ వైర‌ల్‌..

మ్యాచ్ ఫ‌లితంతో ర‌హానే నిరాశ‌చెందాడ‌ని, బ్యాట‌ర్ల‌ వైఫ‌ల్యం పై అత‌డు గ‌ట్టిగానే హ‌ర్ట్ అయిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.