Zaheer Khan : తండ్రైన టీమ్ఇండియా మాజీ ఆటగాడు జహీర్ ఖాన్.. పిల్లాడి పేరేంటో తెలుసా?.. పెళ్లైన ఎనిమిదేళ్ల తరువాత
టీమ్ఇండియా మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ తండ్రి అయ్యాడు.

Sagarika Ghatge And Zaheer Khan Welcome Baby Boy Fatehsinh Khan After 8 Years Of Marriage
టీమ్ఇండియా మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ తండ్రి అయ్యాడు. అతడి భార్య, బాలీవుడ్ నటి సాగరిక ఘట్గే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఈ జంట సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమకు కుమారుడు జన్మించాడని చెప్పారు. దీంతో ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
View this post on Instagram
2017 నవంబర్ 23న జహీర్ ఖాన్, సాగరిక ఘట్గే పెళ్లి చేసుకున్నారు. దాదాపు 8 ఏళ్ల తరువాత ఈ జంట తల్లిదండ్రులు అయ్యారు. తమ బిడ్డకు సంబంధించిన రెండు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తమ కుమారుడికి ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టారు. వారు షేర్ చేసిన ఫోటోల్లో జహీర్, సాగరిక ఎంతో సంతోషంగా కనిపించారు.
జహీర్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడింది. నాలుగు మ్యాచ్‌ల్లో గెలవగా, మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.086గా ఉంది, పాయింట్ల ప్రస్తుతం లక్నో జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది.