Ricky Ponting : ఈ ఏజ్‌లో ఇలాంటివి నాకు అవసరమా.. హార్ట్ బీట్ పెరిగింది.. రికీ పాంటింగ్ కామెంట్స్ వైరల్..
లోస్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌కతా పై అద్భుత విజయం సాధించడం పట్ల పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందిచాడు.

Courtesy BCCI
బంతి బంతికి మారుతున్న ఆధిపత్యం.. నరాలు తెగే ఉత్కంఠ.. మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన తీరు ఇది. ఐపీఎల్ ప్రేమికులకు కావాల్సిన మజా ఇచ్చింది. లోస్కోరింగ్ మ్యాచ్‌ల్లో అసలు సిసలు మజా దొరికింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పంజాబ్ 16 పరుగుల గెలవడంతో చాలా మంది ఆశ్చర్చపోయారు. ఈ విజయం పై పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. కోచ్ గా తాను సాధించిన అత్యుత్తమ విజయం ఇదే అని అన్నాడు.
‘నా హార్ట్ రేటు పెరిగిందిపోయింది. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. ఈ వయసులో ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్‌లు చూడాల్సిన అవసరం నాకు లేదు.’ అని పాంటింగ్ అన్నాడు. 112 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంటూ 16 పరుగుల తేడాతో గెలిచామని, ఇలాంటి మ్యాచ్‌ల్లో కొన్ని సార్లు సగం మ్యాచ్ అయ్యాక ఛేదన కష్టంగా మారుతుందనే విషయం తెలుసునన్నాడు. ఇదే విషయాన్ని జట్టు సభ్యులకు చెప్పినట్లు పేర్కొన్నాడు.
Chahal- Mahvash : నీ టాలెంట్ అద్భుతం.. ఆర్‌జే మహ్‌వశ్ పోస్ట్ వైరల్..
‘పిచ్ కష్టంగా ఉంది. దీనిపై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. చాహల్‌కు గత మ్యాచ్‌లో భుజానికి గాయమైంది. దీంతో మ్యాచ్‌కు ముందు అతడికి ఫిట్‌నెస్ టెస్టు జరిగింది. ప్రాక్టీస్ చేసే సమయంలో చాహల్ ను పిలిచి ఎలా ఉంది అని అడిగా.. 100 శాతం బాగానే ఉన్నట్లుగా అతడు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో అతడి ప్రదర్శన అద్భుతం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వ పడేవాడని.’ అని పాంటింగ్ అన్నాడు.
‘ఈ మ్యాచ్‌లో మా బ్యాటర్ల ప్రదర్శన ఏమంత బాలేదు. షాట్ల ఎంపిక, ఆడిన విధానం బాలేదు. ఇక ఎప్పుడైతే మా ఆటగాళ్లు ఫీల్డింగ్‌కు వచ్చారో అంతా మారిపోయింది. వెంట వెంటనే వికెట్లు పడగొట్టారు. విజయం దగ్గరిదాకా వచ్చి ఓడిపోతే సీజన్‌లో అదే టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆటగాళ్లకు ఎల్లప్పుడూ చెబుతూ ఉంటాను.’ అని పాంటింగ్ చెప్పాడు.
ఇక ఐపీఎల్‌లో నేను ఎన్నో మ్యాచ్‌లకు కోచ్‌గా పని చేశాను. ఈ గెలుపు మాత్రం నాకు ప్రత్యేకంగా నిలిచిపోయిందని చెప్పుకొచ్చాడు.
పంజాబ్ సంచలన విజయం సాధించడంతో ఆ జట్టు ఓనర్ ప్రీతిజింటా సంబరాలు అంబరాన్ని అంటాయి. కోచ్ పాంటింగ్‌తో పాటు చాహల్‌ను కౌగలించుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. తక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కేకేఆర్ జట్టు విఫలమైంది. 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది.
PBKS vs KKR : రహానే ఎంత పని చేశావయ్యా.. యువ ఆటగాడి మాటలు నమ్మి.. మోసపోయావ్ గదయ్యా..!