Chahal- Mahvash : నీ టాలెంట్ అద్భుతం.. ఆర్‌జే మహ్‌వశ్‌ పోస్ట్‌ వైరల్‌..

పంజాబ్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన యుజ్వేంద్ర చాహ‌ల్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

Chahal- Mahvash : నీ టాలెంట్ అద్భుతం.. ఆర్‌జే మహ్‌వశ్‌ పోస్ట్‌ వైరల్‌..

RJ Mahvashs Instagram story for Yuzi Chahal after pbks wins against kkr

Updated On : April 16, 2025 / 9:23 AM IST

మంగ‌వారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. లోస్కోరింగ్ మ్యాచ్‌లో 16 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్‌ 15.3 ఓవర్ల‌లో 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఓపెన‌ర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్ (30; 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), ప్రియాంశ్‌ ఆర్య (22; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) లు రాణించారు. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ డ‌కౌట్ కాగా, జోష్ ఇంగ్లిష్ (2), నేహ‌ల్ వ‌ధేరా (10), గ్లెన్ మాక్స్‌వెల్ (7) లు విఫ‌లం అయ్యారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా మూడు వికెట్లు తీయ‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సునీల్ న‌రైన్‌లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. వైభ‌వ్ అరోరా, అన్రిచ్ నోర్జే లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

PBKS vs KKR : చాహ‌ల్‌కు ద‌గ్గ‌రికి వెళ్లి ఒక్క‌టే చెప్పా.. లోస్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌క‌తా పై గెలుపు త‌రువాత పంజాబ్ కెప్టెన్ అయ్య‌ర్ కామెంట్స్ వైర‌ల్‌..

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో కోల్‌క‌తా 15.1 ఓవ‌ర్ల‌లో 95 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కేకేఆర్‌ బ్యాట‌ర్ల‌లో అంగ్క్రిష్ రఘువంశీ (37; 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అజింక్యా ర‌హానే (17), ఆండ్రీ ర‌సెల్ (17)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. సునీల్ న‌రైన్ (5), క్వింట‌న్ (2), వెంక‌టేశ్ అయ్య‌ర్ (7), రింకూసింగ్ (2) లు విఫ‌లం అయ్యారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో చాహ‌ల్ నాలుగు వికెట్లు తీశాడు. మార్కో జాన్సెన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

పంజాబ్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన యుజ్వేంద్ర చాహ‌ల్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ క్ర‌మంలో రేడియో జాకీ మ‌హ్‌వ‌శ్ చేసిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

చాహ‌ల్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేసిన మ‌హ్‌వ‌శ్‌.. “నీ టాలెంట్ మామూలుగా లేదు. అందుకే ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా గుర్తింపు సాధించావ్‌.. అసంభ‌వ్.” అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఆమె చేసిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

PBKS vs KKR : ర‌హానే ఎంత ప‌ని చేశావ‌య్యా.. యువ ఆట‌గాడి మాట‌లు న‌మ్మి.. మోసపోయావ్‌ గ‌ద‌య్యా..!

కాగా.. చాహ‌ల్, మ‌హ్‌వ‌శ్ ప్రేమ‌లో ఉన్నారంటూ గ‌త‌కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌ను వీర‌ద్ద‌రు క‌లిసి చూసిన సంగ‌తి తెలిసిందే. త‌మ ప్రేమ వార్త‌ల‌పై చాహ‌ల్‌, మ‌హ్‌వ‌శ్ స్పందించారు. అందులో నిజం లేద‌న్నారు. కానీ వీరిద్ద‌రు సోష‌ల్ మీడియాలో చేస్తున్న పోస్టులు చూస్తుంటే వీరిద్ద‌రి ఖ‌చ్చితంగా స‌మ్‌థింగ్ స‌మ్ థింగ్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.