IPL 2025: అయ్యో గిల్.. అద్భుతమైన త్రోతో శుభ్‌మన్ గిల్‌కు షాకిచ్చిన కరుణ్‌ నాయర్.. వీడియో వైరల్

04 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (7) నిరాశపర్చాడు.

Credit BCCI

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సొంతగడ్డపై గుజరాత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో గెలుపుబాట పట్టింది. ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై గుజరాత్ జట్టు విజయం సాధించింది.

Also Read: Vaibhav Suryavanshi : ఓపెనింగ్‌లో మొనగాడిలా ఆడాడు, చివర్లో పసివాడిలా మారాడు.. ఐపీఎల్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ

ఈ మ్యాచ్ లో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (39) టాప్ స్కోరర్ గా నిలిచాడు. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు బ్యాటర్లు అదరగొట్టారు. బట్లర్ (54 బంతుల్లో 97 నాటౌట్) దూకుడుగా ఆడాడు. చివరిలో రూథర్ ఫర్డ్ (43) రాణించడంతో గుజరాత్ జట్టు 19.2 ఓవర్లలో 204 పరుగులు చేసి విజేతగా నిలిచింది.

Also Read: KL Rahul : మ‌ధ్య‌లో వెళ్లినా.. మంచి పంచ్ వేశావ‌య్యా కేఎల్ రాహుల్‌.. కెవిన్ పీట‌ర్సన్ నోట మాట‌రాలే..

అయితే, 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (7) నిరాశపర్చాడు. ఢిల్లీ ఫీల్డర్ కరుణ్ నాయర్ అద్భుతమైన త్రోతో గిల్ కు షాకిచ్చాడు. ముకేశ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ సింగిల్ తీసేందుకు క్రీజును వదిలి వెళ్లాడు. ఈలోపు మరో బ్యాటర్ సుదర్శన్ అలర్ట్ అయ్యి గిల్ ను పరుగుకు రావొద్దని వారించడంతో గిల్ వెనక్కు వెళ్లాడు. అప్పటికే కరుణ్ నాయర్ బంతిని అందుకొని నేరుగా వికెట్లకు విసిరి అద్భుతమైన త్రోతో గిల్ ను ఔట్ చేశాడు. ఊహించని పరిణామంతో శుభ్‌మన్ గిల్ నిరాశతో పెవిలియన్ బాటపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.