KL Rahul : మధ్యలో వెళ్లినా.. మంచి పంచ్ వేశావయ్యా కేఎల్ రాహుల్.. కెవిన్ పీటర్సన్ నోట మాటరాలే..
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కేఎల్ రాహుల్ ఆ జట్టు మెంటర్, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌ను ట్రోల్ చేశాడు.

Pic credit @DC x
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.744గా ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కాగా.. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తన అగ్రస్థానాన్ని మరితం పదిలం చేసుకోవాలని ఢిల్లీ భావిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కేఎల్ రాహుల్ ఆ జట్టు మెంటర్, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌ను ట్రోల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుజరాత్‌తో మ్యాచ్ కోసం ఢిల్లీ ఆటగాళ్లు మైదానంలో శ్రమిస్తున్నారు. అప్పుడు ఢిల్లీ మెంటర్ కెవిన్ పీటర్సన్‌ను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వచ్చి కలిశాడు. ఈ సమయంలో కెవిన్ సరదాగా.. మెంటర్ అంటే ఏమిటో కాస్త చెప్పు? ఇక్కడ ఎవ్వరికి తెలియడం లేదు అని అన్నాడు.
Thanks KL, now we know what a mentor does 😂 pic.twitter.com/JXWSVJBfQS
— Delhi Capitals (@DelhiCapitals) April 19, 2025
అప్పుడు మధ్యలో కలగజేసుకున్న కేఎల్ రాహుల్.. మెంటర్ అంటే సీజన్ మధ్యలో రెండు వారాల పాటు మాల్దీవులకు వెళ్లే వ్యక్తి అని చెప్పాడు. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. దెబ్బకు పీటర్సన్ నోట మాట రాలేదు.
ఇంతకి అసలు సంగతి ఏంటంటే.. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించిన తరువాత ఏప్రిల్ 5 న సెలవు తీసుకుని కెవిన్ పీటర్సన్ మాల్దీవులకు వెళ్లాడు. దీంతో అతడు ఏప్రిల్ 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌కు దూరం అయ్యాడు.
RCB vs PBKS : ఆర్‌సీబీ ఇజ్జత్ కాపాడిన టిమ్ డేవిడ్.. తన బ్యాటింగ్ స్థానంపై సంచలన వ్యాఖ్యలు..
ఈ విషయాన్నే కేఎల్ రాహుల్ ప్రస్తావిస్తూ కెవిన్‌కు కౌంటర్ వేశాడు. ఈ వీడియోను ఢిల్లీ జట్టు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ధన్యవాదాలు కేఎల్ రాహుల్.. ఇప్పుడు మా అందరికి తెలిసింది మెంటర్ ఏం చేస్తాడో అని నవ్వుతున్న ఎమోజీని జత చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.