IPL 2025: ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఆ దేశ దిగ్గజ బ్యాటర్ రికార్డు బద్దలు

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ లో అత్యధిక సార్లు ..

Credit BCCI

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ జట్టు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. తొలుత పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి విజయం సాధించింది.

IPL 2025: మాతో పెట్టుకోకు..! కోహ్లీ, శ్రేయాస్ మధ్య వాగ్వివాదం.. ఆ తరువాత విరాట్ ఏం చేశాడంటే..? వీడియో వైరల్

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ ఆడాడు. తద్వారా ఆర్సీబీ విజయంలో కీలక భూమిక పోషించాడు. 54 బంతుల్లో 73 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. ఈ మ్యాచ్ లో ఆఫ్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నమోదు చేశాడు.

Also Read: IPL 2025: ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ.. చెన్నైపై ముంబై ఘన విజయం, MI హ్యాట్రిక్ విక్టరీ

ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ లో అత్యధిక సార్లు యాబైకి పైగా స్కోర్లు చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. తద్వారా డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో 66సార్లు 50కిపైగా స్కోర్లు చేసిన బ్యాటర్ గా ఇన్నాళ్లు తొలి స్థానంలో కొనసాగాడు. మొత్తం 184 మ్యాచ్ లు ఆడిన వార్నర్.. 62 ఆఫ్ సెంచరీలు, నాలుగు సెంచరీలు చేశాడు. మొత్తం 6,556 పరుగులు పూర్తి చేశాడు. పంజాబ్ కింగ్స్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ 260 మ్యాచ్ లలో 67 సార్లు 50కిపైగా స్కోర్లు నమోదు చేశాడు. ఇందులో 59 ఆఫ్ సెంచరీలు, ఎనిమిది సెంచరీలు ఉన్నాయి.

అత్యధిక సెంచరీల రికార్డు కూడా విరాట్ కోహ్లీ పేరుమీదే ఉంది. ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు కోహ్లీ (ఎనిమిది సెంచరీలు). సెంచరీల జాబితాలో జోస్ బట్లర్ రెండో స్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటి వరకు ఏడు సెంచరీలు చేశాడు.