MI vs PBKS Highlights IPL 2026: తిరుగులేని పంజాబ్.. చెలరేగిన సింగ్, అయ్యర్.. ముంబైపై ఘన విజయం
MI vs PBKS Highlights IPL 2026 Punjab Kings Beats Mumbai Indians
MI vs PBKS Highlights: ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. పంజాబ్ ఖాతాలో మరో గెలుపు చేరింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 196 పరుగుల టార్గెట్ ను పంజాబ్ అలవోకగా చేజ్ చేసింది. 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది పంజాబ్. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సింగ్ 39 బంతుల్లోనే 88 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అయ్యర్ 35 బంతుల్లో 66 పరుగులు బాదాడు.
*శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ విన్యాసం.. బిత్తరపోయిన రోహిత్, సూర్య.. వీడియో
ఈ సీజన్ లో పంజాబ్ కి ఇది 4వ విజయం. ఇంతవరకు ఒక్క ఓటమి లేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ కి వరుసగా నాలుగో పరాజయం. 5 మ్యాచులు ఆడిన ముంబై నాలుగింటిలో ఓటమిపాలైంది. ముంబై పై గెలుపుతో పాయింట్స్ టేబుల్ లో టాప్ కి దూసుకెళ్లింది పంజాబ్.
