IPL trade Shardul Thakur for MI Arjun Tendulkar to LSG
IPL trade : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉనప్పటికి కూడా ఇప్పటికే అన్ని ఫ్రాంఛైజీలు ఈ సీజన్ కోసం సన్నద్ధం అవుతున్నాయి. ఈ సీజన్ కన్నా ముందు వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆటగాళ్ల రిటెన్షన్ కు నవంబర్ 15 డెడ్‌లైన్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్ని ఫ్రాంఛైజీలు ట్రేడ్ డీల్స్ ను ముమ్మరం చేస్తున్నాయి.
ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ట్రేడ్ డీల్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ప్రకారం.. సంజూ శాంసన్‌ను సీఎస్‌కు.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌లు రాజస్థాన్ కు బదిలీ కానున్నారు. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
PAK vs SL: బాబోయ్ మేం ఉండం ఈ పాకిస్తాన్ లో… 8 మంది శ్రీలంక క్రికెటర్లు జంప్! కారణం ఇదే..
ఇప్పుడు మరో ట్రేడ్ డీల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అది లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌ను ఇచ్చి లక్నో సూపర్ జెయింట్స్ నుంచి పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవాలని ముంబై భావిస్తుందట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి.
ట్రేడ్ డీల్‌లో భాగంగా వీరిద్దరి ఒకరికి బదులుగా మరొకరి స్వాప్ చేసుకోవడం లేదంటే.. ఒకరికి వేరొక ఆటగాడిని కోరడం వంటి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
గత వేలంలో శార్దూల్ ఠాకూర్ అమ్ముడు పోలేదు. అయితే.. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఓ ఆటగాడు గాయపడడంతో అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌కు లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. ఈ సీజన్‌లో అతడు 10 మ్యాచ్‌లు ఆడాడు. 28.85 సగటు 11.03 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. అయితే.. అతడు బ్యాటింగ్‌లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు.
Ishan Kishan : ఇషాన్ కిషన్ ఐపీఎల్ భవిష్యత్తు పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారిక ప్రకటన..
గత కొన్నాళ్లుగా అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడిని బేస్ ప్రైజ్ రూ.20లక్షలకే ముంబై దక్కించుకుంది. 26 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్ 2023, 2024 రెండు సీజన్లలో కలిపి నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మొత్తంగా అతడు 5 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీశాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కు చేసేందుకు అవకాశం రాగా 13 పరుగులు చేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ ఆర్ అశ్విన్ అనుకోకుండా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఐపీఎల్ 2026 కి ముందు ముంబై ఇండియన్స్‌కు బదిలీ చేసినట్లు ధృవీకరించాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. అశ్విన్ ఈ విషయం వెల్లడించాడు. ముంబై జట్టు ఎవ్వరిని విడుదల చేయదు. దీపక్ చాహర్ గాయాలతో సతమతం అవుతున్నాడు. అతడి స్థానంలో మరొకరిని కనుగొడమే ముంబై ప్రధాన కర్తవ్యం. ఇప్పటికే వారు లక్నో నుంచి ట్రేడ్ డీల్ ద్వారా శార్దూల్ ఠాకూర్ ను సొంతం చేసుకున్నారు. అది జరిగిపోయింది. ఇక వారు స్పిన్నర్ కోసం అన్వేషించవ్చు అని చెప్పుకొచ్చాడు.
Ashwin accidentally revealed that shardul thakur has been traded to MI …
Ashwin always at the crime scene when you talk abt team leaks 😭😭😭 pic.twitter.com/feQA0bHG92
— Sumittttttt (@Sumittt_0707) November 12, 2025
IND vs SA : కోల్‌కతా వేదికగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్టు.. వర్షం ముప్పు ఉందా?
అయితే.. తరువాత జరిగిన పొరబాటును గుర్తించిన అశ్విన్ తన వీడియోను డిలీట్ చేసినప్పటికి కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో వైరల్ అవుతోంది.