IND vs SA : కోల్‌కతా వేదికగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్టు.. వర్షం ముప్పు ఉందా?
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం (IND vs SA) నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Did rain threat to India vs South Africa 1st Test match in Kolkata
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం (నవంబర్ 14) నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇస్తోంది. ఇటీవల భారత జట్టు ఆసీస్‌తో ఆడిన టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న తొలి టెస్టుకు వర్షం ముప్పు ఏమైనా పొంచి ఉందా ? లేదా ? అన్న అనుమానాలను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. క్రికెట్ ఫ్యాన్స్‌కు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని తెలిపింది. అయితే.. అప్పుడప్పుడు చిరు జల్లులు పడే అవకాశం మాత్రం ఉన్నట్లు వెల్లడిచింది. అది కూడా చాలా తక్కువగా ఉంటుందని తెలిపింది. ఇక మ్యాచ్ జరిగే రోజుల్లో ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా ఉండవచ్చునని వివరించింది.
పిచ్ ఎలా ఉండనుందంటే..?
పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. తొలి రోజు పేసర్లకు ఆ తరువాత స్పిన్నర్లకు అనుకూలించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Ishan Kishan : ఇషాన్ కిషన్ ఐపీఎల్ భవిష్యత్తు పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారిక ప్రకటన..
హెడ్ టు హెడ్ రికార్డు..
ఇప్పటి వరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు 44 సార్లు టెస్టుల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో భారత్ 16 మ్యాచ్‌ల్లో, దక్షిణాఫ్రికా 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఇక భారత గడ్డ పై 19 మ్యాచ్‌ల్లో తలపడగా.. దక్షిణాప్రికా 5 మ్యాచ్‌ల్లో, టీమ్ఇండియా 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
టెస్ట్ సిరీస్‌కు స్వ్కాడ్స్ ఇవే..
భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.
దక్షిణాఫ్రికా జట్టు ఇదే..
టెంబా బావుమా (కెప్టెన్), జుబేర్ హంజా, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, సెనూరన్ ముత్తుసామి, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్‌క్రమ్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్బ్స్ (వికెట్ కీపర్).
