IND vs SA : టెస్టు సిరీస్‌కు ముందు ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ కేశ‌వ్‌ మ‌హ‌రాజ్ కీల‌క వ్యాఖ్య‌లు.. భార‌త్‌లో భార‌త్‌ను.. 15 సంవ‌త్స‌రాలు..

ఆతిథ్య భార‌త్‌తో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20 (IND vs SA) మ్యాచ్‌లు ఆడ‌నుంది.

IND vs SA : టెస్టు సిరీస్‌కు ముందు ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ కేశ‌వ్‌ మ‌హ‌రాజ్ కీల‌క వ్యాఖ్య‌లు.. భార‌త్‌లో భార‌త్‌ను.. 15 సంవ‌త్స‌రాలు..

Keshav Maharaj comments Ahead of test series against India

Updated On : November 12, 2025 / 2:50 PM IST

IND vs SA : ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆతిథ్య భార‌త్‌తో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది. న‌వంబ‌ర్ 14న కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టెస్టు మ్యాచ్‌తో ఈ ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది.

కాగా.. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు భార‌త దేశంలో (IND vs SA) టెస్టు మ్యాచ్ గెలిచి 15 సంవ‌త్స‌రాలు అయింది. అయితే.. ఈ సారి దీన్ని మార్చాల‌ని ప్రొటీస్ జ‌ట్టు ప‌ట్టుద‌ల‌తో ఉందని స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హ‌రాజ్ తెలిపాడు. భార‌త్‌లో భార‌త్‌ను ఓడించేందుకు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు. ఇది క‌ఠినమైన సిరీస్ అని, అయిన‌ప్ప‌టికి కూడా త‌మ‌ని తాము నిరూపించుకోవ‌డానికి ఓ అద్భ‌త అవ‌కాశం అన్నాడు.

IND vs SA : భార‌త్ వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా? మ్యాచ్ టైమింగ్స్‌, షెడ్యూల్ ఇదే..

చివ‌రిసారిగా ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు 2010లో భార‌త్ గ‌డ్డ‌పై టెస్టు మ్యాచ్‌లో గెలిచింది. ఆ త‌రువాత 2015, 2019లో భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్ప‌టికి కూడా స‌ఫారీలు ఒక్క మ్యాచ్‌లో కూడా విజ‌యాన్ని అందుకోలేదు. అయితే.. ఈ సారి ప‌రిస్థితుల్లో మార్పు ఉంటుంద‌నే ఆశాభావాన్ని మ‌హ‌రాజ్ వ్య‌క్తం చేశాడు.

ఈ సిరీస్ కోసం పూర్తి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లు ఉంటాయ‌ని తాము భావించ‌డం లేద‌న్నాడు. నిజం చెప్పాలంటే భార‌త్‌లో మంచి పిచ్‌లు ఉంటాయ‌ని, అయితే.. మ్యాచ్ సాగుతున్న కొద్ది వాటి స్వ‌భావం మారుతూ ఉంటాయ‌ని చెప్పుకొచ్చాడు. ఇటీవ‌ల భార‌త్‌, వెస్టిండీస్ టెస్టు సిరీస్‌ను చూస్తే.. మంచి పిచ్‌ల మీదే మ్యాచ్‌లు జ‌రిగాయ‌న్నాడు. మ్యాచ్‌లు నాలుగు నుంచి అయిదు రోజుల పాటు సాగింద‌న్నాడు.

Mumbai Indians : టాటా.. బైబై.. ఈ ఐదుగురికి ముంబై గుడ్ బై?

ఇటీవ‌లే పాకిస్తాన్ పై రెండో టెస్టు మ్యాచ్‌లో విజ‌యం సాధించిన స్పూర్తితో భార‌త్‌లో అడుగుపెట్టామ‌న్నాడు. ఇక టాస్ సంబంధం లేకుండా విజ‌యం కోస‌మే పోరాడ‌తామ‌ని చెప్పుకొచ్చాడు.