IND vs SA : భార‌త్ వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా? మ్యాచ్ టైమింగ్స్‌, షెడ్యూల్ ఇదే..

టెస్టుల్లో భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య హెడ్ టు హెడ్ రికార్డులు (IND vs SA) ఎలా ఉన్నాయి? ఈ సిరీస్ ను టీవీ, మొబైల్‌ల‌లో ఎక్క‌డ వీక్షించవ‌చ్చో ఓ సారి చూద్దాం..

IND vs SA : భార‌త్ వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా? మ్యాచ్ టైమింగ్స్‌, షెడ్యూల్ ఇదే..

IND vs SA Schedule Live Streaming Venues Dates And Timings

Updated On : November 12, 2025 / 2:20 PM IST

IND vs SA : ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ 2025-27)లో భాగంగా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ (ఫ్రీడ‌మ్ ట్రోఫీ) జ‌ర‌గ‌నుంది. న‌వంబ‌ర్ 14 నుంచి కోల్‌క‌తా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టెస్టు మ్యాచ్ ద్వారా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు కోల్‌క‌తా చేరుకుని ప్రాక్టీస్‌ను మొద‌లుపెట్టాయి. శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలో భార‌త్ బ‌రిలోకి దిగ‌నుండ‌గా, టెంబా బ‌వుమా నేతృత్వంలో ద‌క్షిణాఫ్రికా ఆడ‌నుంది.

ఇదిలా ఉంటే.. టెస్టుల్లో భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి? ఈ సిరీస్ ను టీవీ, మొబైల్‌ల‌లో ఎక్క‌డ వీక్షించవ‌చ్చో ఓ సారి చూద్దాం..

హెడ్ టు హెడ్ రికార్డులు..

భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 44 టెస్టు మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో టీమ్ఇండియా 16 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. ద‌క్షిణాఫ్రికా 18 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇక భార‌త గ‌డ్డ పై 19 మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో ద‌క్షిణాప్రికా 5 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 11 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా గెలుపొందింది.

Mumbai Indians : వేలానికి ముందు ముంబై ఈ ఐదుగురు ఆట‌గాళ్ల‌ను వ‌దిలివేయ‌నుందా?

ఎక్క‌డ చూడొచ్చ‌డంటే..?

భార‌త కాల‌మానం ప్రకారం టెస్టు మ్యాచ్‌లు ఉద‌యం 9.30 గంట‌కు ప్రారంభం అవుతాయి. భార‌త్, ద‌క్షిణాఫ్రికా సిరీస్ హ‌క్కుల‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్ క‌లిగి ఉంది. ఈ క్ర‌మంలో టీవీల్లో మ్యాచ్‌ల‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారం కానున్నాయి.

ఇక ఆన్‌లైన్‌, మొబైల్ ఫోన్‌ల‌లో జియో హ‌ట్‌స్టార్‌లో మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సిమ్ వినియోగ‌దారులు ప్ర‌త్యేక రిచార్జ్‌ ఫ్లాన్స్ క‌లిగి ఉంటే.. వారికి జియో హ‌ట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా వ‌స్తుంది. హాట్ స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉన్న‌వారు మ్యాచ్‌ల‌ను ఫ్రీగా చూడొచ్చు.

Sanju Samson-Jadeja : సంజూ శాంస‌న్-ర‌వీంద్ర‌ జ‌డేజా ట్రేడ్ డీల్‌లో సూప‌ర్ ట్విస్ట్‌.. ఆగిపోయిన చ‌ర్చ‌లు..!

టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టెస్టు – నంబ‌ర్ 14 నుంచి 18 వ‌ర‌కు (ఈడెన్ గార్డెన్స్‌)
* రెండో టెస్టు – నవంబర్ 22 నుంచి 26 (గౌహతి)