Ishan Kishan : ఇషాన్ కిషన్ ఐపీఎల్ భవిష్యత్తు పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారిక ప్రకటన..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ను వేలానికి వదిలివేయనుందనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి.
Sun Risers Hyderabad release official statement on Ishan Kishan IPLfuture
Ishan Kishan : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు మినీ వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ వేలానికి ముందు అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే, విడుదల చేసే ఆటగాళ్లు జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 15 డెడ్‌లైన్ అన్న సంగతి తెలిసిందే. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ను వేలానికి వదిలివేయనుందనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా సన్‌రైజర్స్ ఓ స్పష్టత ఇచ్చింది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో ఫైనల్ కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2025 సీజన్‌లో అంచనాలను అందుకోలేదు. పాట్ కమిన్స్ సారథ్యంలోని ఎస్ఆర్‌హెచ్ ఆరో స్థానంతో సీజన్‌ను ముగించింది. ఈ క్రమంలో జట్టులో పలు మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమైంది.
IND vs SA : తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు..! క్లారిటీ ఇచ్చిన సహాయ కోచ్..
Orange looks 𝟐𝟒𝐊 on him 🧡 ✨
Ishan Kishan | #PlayWithFire pic.twitter.com/xgfSZVVpUe
— SunRisers Hyderabad (@SunRisers) November 12, 2025
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు నిర్వహించిన మెగావేలంలో ఇషాన్ కిషన్‌ను ఎస్ఆర్‌హెచ్ రూ.11.25 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకంతో ఇషాన్ సత్తా చాటాడు. అయితే.. ఆ తరువాత అతడు ఘోరంగా విఫలం అయ్యాడు. మొత్తంగా 13 ఇన్నింగ్స్‌ల్లో 354 పరుగులు చేశాడు. ఈ సీజన్ ముగిసిన వెంటనే అతడిని సన్‌రైజర్స్ వదులుకుంటుందనే వార్తలు జోరు అందుకున్నాయి.
తాజాగా వీటిపై ఓ వీడియో ద్వారా సన్‌రైజర్స్ స్పందించింది. 19 సెకన్ల నిడివితో కూడిన వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ జెర్సీతోనే కనిపించాడు. ఈ పోస్ట్‌కు Orange looks 𝟐𝟒𝐊 on him అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే అతడిని వేలానికి వదిలివేయడం లేదని, జట్టుతోనే ఉంటాడని ఎస్ఆర్‌హెచ్ ధ్రువీకరించింది. దీంతో వేలానికి ఇషాన్ రానున్నాడు అనే వార్తలకు తెరపడినట్లైంది.
