IPL2022 CSK Vs PBKS : చివర్లో చేతులెత్తేసిన చెన్నై.. మళ్లీ ఓటమి బాట.. పంజాబ్ చేతిలో చిత్తు

చెన్నై మళ్లీ ఓటమి బాట పట్టింది. పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది. పంజాబ్ నిర్దేశించిన 188 పరుగుల టార్గెట్ ను ఛేదించలేకపోయింది.

Ipl2022 Csk Vs Pbks

IPL2022 CSK Vs PBKS : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. చెన్నై మళ్లీ ఓటమి బాట పట్టింది. పంజాబ్‌ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై ఆఖర్లో చేతులెత్తేసింది. ఫలితంగా పంజాబ్ చేతిలో పరాజయం చవిచూసింది. పంజాబ్ నిర్దేశించిన 188 పరుగుల టార్గెట్ ను ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులే చేసింది. దీంతో 11 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది.

చెన్నై జట్టులో అంబటి రాయుడు దంచి కొట్టాడు. ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రాయుడు 39 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. అయితే మరో ఎండ్ లో సహకారం కరువైంది. దీంతో చెన్నై ఓటమిపాలైంది. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ, రిషి ధావన్ తలో రెండు వికెట్లు తీశారు. సందీప్ శర్మ, అర్ష్ దీప్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

IPL2022 MI Vs LSG : మారని ముంబై తీరు.. వరుసగా 8వ పరాజయం.. లక్నో ఘన విజయం

ఆఖరి వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై పంజాబ్‌ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 187/4 స్కోర్ చేసింది. శిఖర్ ధావన్‌ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడు. సూపర్ హాఫ్ సెంచరీ(59 బంతుల్లో 88 పరుగులు-నాటౌట్) చేశాడు. అనంతరం చెన్నై ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్‌లో 27 పరుగులు కావాల్సిన తరుణంలో ఎంఎస్ ధోనీ (12) తొలి బంతికే సిక్స్‌ కొట్టి ఊపు తెచ్చాడు. అయితే తర్వాతి రెండు బంతులకు ఒకటే పరుగు రావడం.. నాలుగో బంతికి ధోనీ ఔట్‌ కావడంతో చెన్నై ఆశలు గల్లంతయ్యాయి.

ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చినా అవి చెన్నై విజయానికి సరిపోలేదు. చెన్నై బ్యాటర్ అంబటి రాయుడు (78) పోరాడాడు. రుతురాజ్‌ గైక్వాడ్ 30, రవీంద్ర జడేజా 20* పరుగులు చేశారు. ఈ విజయంతో పంజాబ్‌ (8) పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. కాగా, ఈ సీజన్ లో చెన్నైకిది ఆరో ఓటమి. గత మ్యాచ్ లో ముంబైపై గెలిచిన చెన్నై అదే జోరుని కంటిన్యూ చేయలేకపోయింది. పంజాబ్‌ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై ఆఖర్లో చేతులెత్తేసింది.

IPL2022 RCB Vs SRH : హైదరాబాద్ జైత్రయాత్ర.. వరుసగా 5వ విజయం

జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్‌ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్‌), ఎంఎస్ ధోనీ, మిచెల్‌ సాంట్నర్, డ్వేన్‌ ప్రిటోరియస్‌, డ్వేన్‌ బ్రావో, ముకేశ్‌ చౌదరి, మహీశా తీక్షణ

పంజాబ్ కింగ్స్ ‌: మయాంక్‌ అగర్వాల్, శిఖర్ ధావన్‌, జానీ బెయిర్‌ స్టో, లియామ్‌ లివింగ్‌ స్టోమ్, జితేశ్‌ శర్మ, భానుక రాజపక్స, రిషి ధావన్‌, కగిసో రబాడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్‌ సింగ్‌