IPL2022 DelhiCapitals Vs PBKS : మెరిసిన మార్ష్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..

ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్‌ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 48 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్‌ 16 బంతుల్లో 32 పరుగులతో రాణించాడు.(IPL2022 DelhiCapitals Vs PBKS)

IPL2022 DelhiCapitals Vs PBKS : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్‌ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 48 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ లో 3 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి.

సర్ఫరాజ్ ఖాన్‌ 16 బంతుల్లో 32 పరుగులతో రాణించాడు. ఢిల్లీ మిగతా బ్యాటర్లలో లలిత్‌ యాదవ్‌ (24) ఫర్వాలేదనిపించగా.. డేవిడ్ వార్నర్ (0) గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (7), రోమన్‌ పావెల్ (2), శార్దూల్ ఠాకూర్‌ (3), అక్షర్‌ పటేల్ (17*), కుల్‌దీప్‌ యాదవ్‌ (2*) పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్ష్‌దీప్ సింగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టాడు. రబాడ ఒక వికెట్ తీశాడు.(IPL2022 DelhiCapitals Vs PBKS)

Khan

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి తొలి బంతికే గట్టి షాక్ తగిలింది. విధ్వంస బ్యాటర్‌ డేవిడ్ వార్నర్ (0) గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. తొలి ఓవర్‌ వేసిన లియామ్‌ లివింగ్‌స్టోన్‌ బౌలింగ్‌లో వార్నర్ షాట్‌కు యత్నించి రాహుల్ చాహర్‌ చేతికి చిక్కాడు.

Sourav Ganguly: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ

ఢిల్లీ, పంజాబ్ జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ప్లేఆఫ్స్ బెర్తు కోసం కీలక సమరం. ఏది ఓడితే అది ఇంటిముఖం పట్టక తప్పదు. టాస్‌ నెగ్గిన పంజాబ్‌ కెప్టెన్‌ మయాంక్ అగర్వాల్ బౌలింగ్‌ ఎంచుకుని ఢిల్లీకి బ్యాటింగ్‌ అప్పగించాడు. గత మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసి రేసులోకి వచ్చిన పంజాబ్‌.. అదే ఊపును కొనసాగించి గెలవాలని భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ పరిస్థితి కూడానూ పంజాబ్‌ మాదిరిగానే ఉంది. చెన్నైపై ఘోర పరాభవం తర్వాత పటిష్టమైన రాజస్తాన్‌పై అద్భుత విజయం సాధించింది. ఇరు జట్లకూ ఇదే కీలకం. ఇందులో గెలిచి తమ ఆఖరి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.

IPL2022 Lucknow Vs RR : లక్నోకి రాజస్తాన్ షాక్.. కీలక మ్యాచ్‌లో ఘన విజయం

జట్ల వివరాలు:
ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్‌, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్‌ పటేల్, శార్దూల్ ఠాకూర్, అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్.

పంజాబ్‌ కింగ్స్ : జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్‌ లివింగ్‌ స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జితేశ్‌ శర్మ, హర్‌ప్రీత్ సింగ్, రిషి ధావన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌ దీప్‌ సింగ్‌.

ట్రెండింగ్ వార్తలు