Sourav Ganguly: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ

పీఎల్‌ 2022 సీజన్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ లో కనిపించడం లేదు. దీనిపై స్పందించిన బీసీసీఐ ప్రెసిడెంట్ అదేం పెద్ద సమస్య కాదంటున్నారు

Sourav Ganguly: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ

Ganguly

Sourav Ganguly: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ లో కనిపించడం లేదు. దీనిపై స్పందించిన బీసీసీఐ ప్రెసిడెంట్ అదేం పెద్ద సమస్య కాదంటున్నారు. ఐపీఎల్‌ లో ఆల్ టైం హయ్యస్ట్ స్కోరర్ విరాట్ ప్రస్తు ఐపీఎల్‌ లో 13మ్యాచ్ లు ఆడి కేవలం 236పరుగులు మాత్రమే నమోదు చేశాడు. అందులో మూడు గోల్డెన్ డక్ లు కూడా ఉండటం గమనార్హం.

సీజన్ మొత్తానికి విరాట్ 50 పరుగుల మార్క్ చేరుకున్నది ఒకే ఒక్కసారి. స్లో పేస్ బ్యాటింగ్ కు గానూ ఆర్సీబీ.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది.

మరోవైపు రోహిత్ 12మ్యాచ్ లు ఆడి 218పరుగులు మాత్రమే చేశాడు. ఒక్కసారి కూడా 50పరుగుల మార్క్ చేరుకోలేకపోయాడు. మరికొద్ది వారాల్లో మొదలుకానున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా క్రికెట్ అభిమానులు వీరిద్దరి ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేస్తుంటే, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మాత్రం పెద్దగా ఇబ్బంది లేదంటున్నారు.

Read Also: విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై గంగూలీ రియాక్షన్!

“రోహిత్ లేదా విరాట్ ఫామ్ గురించి అస్సలు ఆందోళన చెందడం లేదు. వారు నిజమైన స్టార్ ప్లేయర్లు. టీ20 వరల్డ్ కప్ చాలా దూరంలో ఉంది. వాళ్లపై చాలా నమ్మకంగా ఉన్నా.” అని గంగూలీ చెప్తున్నారు.

రోహిత్ ఇటీవల పరుగులు చేయలేకపోతున్నాడు. అతని ఫామ్ ఐపిఎల్‌లో మాత్రమే పడిపోయింది. మరోవైపు, కోహ్లి నవంబర్ 2019 నుండి సెంచరీ చేయలేదు. 100 ఇన్నింగ్స్‌లకు పైగా ఏ స్థాయిలోనూ మూడెంకెల మార్క్‌ను చేరుకోలేకపోయాడు.

IPL 2022 తర్వాత ఇద్దరు ఆటగాళ్లకు చాలా అవసరమైన రెస్ట్ తీసుకుంటారని, ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. టీమిండియా జూలైలో ఇంగ్లాండ్ జట్టుతో ఒక టెస్టు, 3 ODIలు, అనేక T20లు ఆడాల్సి ఉంది.