IPL2022 Lucknow Vs RR : లక్నోకి రాజస్తాన్ షాక్.. కీలక మ్యాచ్‌లో ఘన విజయం
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో లక్నోని చిత్తు చేసింది. 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.(IPL2022 Lucknow Vs RR)

IPL2022 Lucknow Vs RR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో లక్నోని చిత్తు చేసింది. 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 179 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసింది.
లక్నో బ్యాటర్లలో దీపక్ హుడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. హుడా 39 బంతుల్లో 59 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్య(25), మార్కస్ స్టోయినస్(27) పరుగులు చేశారు. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, మెక్ కాయ్ తలో రెండు వికెట్లు తీశారు. యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశాడు.(IPL2022 Lucknow Vs RR)
A double-wicket over! 👌 👌
Obed McCoy dismisses Jason Holder and Dushmantha Chameera. 👍 👍#LSG 120/7.
Follow the match 👉 https://t.co/9jNdVD6NoB#TATAIPL | #LSGvRR | @rajasthanroyals pic.twitter.com/EikzpXOtPG
— IndianPremierLeague (@IPL) May 15, 2022
ప్లేఆఫ్స్‌కు ముందు లక్నోకి ఇది షాక్ అనే చెప్పాలి. ఈ విజయంతో రాజస్తాన్ (16, +0.304) పాయింట్ల టేబుల్ లో రెండో స్థానానికి చేరుకుంది. రన్‌రేట్ తగ్గడంతో లక్నో (16, +0.262) మూడో స్థానానికి పడిపోయింది. ఇక మిగిలిన మ్యాచుల్లో అద్భుతాలు జరిగితే తప్పితే ఈ రెండు టీమ్‌లు దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్లే.
Hardik Pandya: ప్రపంచమంతా క్రికెట్ చూస్తోంది.. కెప్టెన్ సెన్సిబుల్‌గా ఉండటం చాలా ముఖ్యం – షమీ
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్… ఓ మోస్తరు స్కోరే చేసింది. ఆదిలోనే స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ వికెట్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత యశస్వీ జైస్వాల్ (41) సత్తా చాటాడు. బట్లర్ అవుట్‌తో అతడికి జత కూడిన కెప్టెన్ సంజూ శాంసన్ (32) దూకుడుగానే కనిపించినా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. తర్వాత జైస్వాల్‌కు జత కలిసిన దేవదత్ పడిక్కల్ (39) రాణించాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడటంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
IPL2022 Kolkata Vs SRH : కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ విఫలం.. వరుసగా 5వ ఓటమి
ఇక లక్నో బౌలింగ్ విషయానికి వస్తే… వరుసగా వికెట్లు తీసినా.. లక్నో బౌలర్లు పరుగులు మాత్రం భారీగానే సమర్పించుకున్నారు. లక్నో బౌలర్ మార్కస్ స్టోయినిస్ ఒక్క ఓవర్ మాత్రమే వేసి ఏకంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు. రవి బిష్ణోయ్‌కు రెండు వికెట్లు దక్కగా… అవేశ్ ఖాన్, జాసన్ హోల్డర్, ఆయుష్ బదోనీకి తలో వికెట్ దక్కింది.
.@rajasthanroyals return to winning ways! 👏 👏@IamSanjuSamson & Co. register their 8⃣th victory of the season as they beat #LSG by 24 runs. 👍 👍
Scorecard 👉 https://t.co/9jNdVDnQqB#TATAIPL | #LSGvRR pic.twitter.com/9vA9lVStm5
— IndianPremierLeague (@IPL) May 15, 2022
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు : క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జాసన్ హోల్డర్, మోహ్‌సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీర, అవేశ్ ఖాన్.
రాజస్తాన్ రాయల్స్ జట్టు : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, చాహల్, మెక్‌కాయ్.
- IPL 2022: లక్ష మంది నోట.. ఒకే ఒక్క పాట “వందేమాతరం”
- IPL 2022: మ్యాచ్ ఫిక్సింగా.. “రాజస్థాన్ స్కోరు అందుకే అలా”
- IPL2022 Title Winner Gujarat : ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్.. తొలి సీజన్లోనే కప్పు నెగ్గి చరిత్ర
- IPL 2022 Final Match : ఫైనల్లో గుజరాత్ బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోరుకే కుప్పకూలిన రాజస్తాన్
- IPL 2022: టాస్ వేసేటప్పుడు రవిశాస్త్రి చెవిలో పాండ్యా
1Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్
2Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
3Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
4Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
5New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
6IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కి వరుణుడి ఆటంకం
7Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
8Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
9Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు
10TS Inetr Results: ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే..
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?