Hardik Pandya: ప్రపంచమంతా క్రికెట్ చూస్తోంది.. కెప్టెన్ సెన్సిబుల్‌గా ఉండటం చాలా ముఖ్యం – షమీ

హార్దిక్ పాండ్యా లీడర్‌షిప్‌లో గుజరాత్ టైటాన్స్ టోర్నమెంట్ లోనే కొత్త ఉత్సాహాన్ని క్రియేట్ చేసింది. అంతేకాకుండా ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్ లో ప్లేఆఫ్ కు చేరిన తొలి జట్టుగా పేరు తెచ్చుకుంది. 12గేమ్స్ ఆడిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల టేబుల్ లో టాప్-1లో నిలిచింది.

Hardik Pandya: ప్రపంచమంతా క్రికెట్ చూస్తోంది.. కెప్టెన్ సెన్సిబుల్‌గా ఉండటం చాలా ముఖ్యం – షమీ

Hardik Pandya

 

 

Hardik Pandya: హార్దిక్ పాండ్యా లీడర్‌షిప్‌లో గుజరాత్ టైటాన్స్ టోర్నమెంట్ లోనే కొత్త ఉత్సాహాన్ని క్రియేట్ చేసింది. అంతేకాకుండా ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్ లో ప్లేఆఫ్ కు చేరిన తొలి జట్టుగా పేరు తెచ్చుకుంది. 12గేమ్స్ ఆడిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల టేబుల్ లో టాప్-1లో నిలిచింది. కెప్టెన్‌గా హార్దిక్ కనబరుస్తున్న శైలితో మూడు డిపార్ట్ మెంట్ల నుంచి కాంప్లిమెంట్లు అందుకుంటున్నాడు.

అంతేకాకుండా ప్రస్తుతం జట్టులోనే టాప్ స్కోరర్ గా నిలిచాడు హార్దిక్. 11గేమ్స్ లో 344పరుగులు చేశాడు. వెన్నెముకకు గాయం కావడంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన పాండ్యా ప్రస్తుత ఫామ్ రిటర్న అవుతాడనిపిస్తుంది.

హార్దిక్ మైదానంలో తన భావోద్వేగాలను ప్రదర్శించడానికి ఎప్పుడూ వెనుకాడడు. తన ఐపీఎల్ కెప్టెన్ నాయకత్వ బాధ్యతను తగ్గించుకున్నాడని టైటాన్స్ పేసర్ మహమ్మద్ షమీ అభిప్రాయపడ్డాడు.

Read Also: ధోనీతో పోటీ పడాలనుకుంటున్నా – హార్దిక్ పాండ్యా

“అతను (హార్దిక్) కెప్టెన్ అయిన తర్వాత మరింత సింపిల్సిటీ అలవరచుకున్నాడు. రెస్పాండ్ అయ్యే తీరు మారిపోయింది. ప్రపంచం మొత్తం క్రికెట్‌ను చూస్తుంది కాబట్టి మైదానంలో అతని భావోద్వేగాలను నియంత్రించమని అతనికి సలహా ఇచ్చాను” అని షమీ మీడియా ప్రతినిధులతో అన్నారు.

“ఒక నాయకుడిగా తెలివిగా ఉండటం, పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ పాత్రను పరిపూర్ణంగా నిర్వహించాడు” అని భారత సీనియర్ బౌలర్ జోడించారు.

31 ఏళ్ల పేసర్ హార్దిక్ కెప్టెన్సీ శైలిని MS ధోని, విరాట్ కోహ్లీ వంటి వారితో పోల్చాడు. జట్టును నడిపించే విషయంలో ప్రతి కెప్టెన్‌కు ప్రత్యేకమైన విధానం ఉంటుందని చెప్పాడు.

“ప్రతి కెప్టెన్‌కు భిన్నమైన స్వభావాలు ఉంటాయి. మహి (ధోని) భాయ్ నిశ్శబ్దంగా ఉండేవాడు, విరాట్ దూకుడుగా ఉండేవాడు, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా రోహిత్ ముందుంటాడు, కాబట్టి హార్దిక్ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడం రాకెట్ సైన్స్ కాదు” అని షమీ పేర్కొన్నాడు.