Ipl2022 Kkr Vs Pbks
IPL2022 KKR Vs PBKS : ఐపీఎల్ 2022 సీజన్ 15 లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. 18.2 ఓవర్లలోనే 137 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ ముందు 138 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ బ్యాటర్లలో భనుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 9 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో మూడు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి.
IPL 2022: నేరుగా మహిళ తలమీదకు సిక్సు బాదేసిన ఆయుష్ బదోనీ
పంజాబ్ జట్టులో అతడే టాప్ స్కోరర్ కావడం విశేషం. లియామ్ లివింగ్ స్టోన్ (19), ఓపెనర్ శిఖర్ ధావన్ (16), హర్ ప్రీత్ బ్రర్ (14), రాజ్ బవా (11) పరుగులు చేశారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1), షారుఖ్ ఖాన్ (0), రాహుల్ చాహర్ (0) విఫలయ్యారు. ఆఖర్లో వచ్చిన కగిసో రబాడ (16 బంతుల్లో 25) పరుగులు చేశాడు. ఓడీన్ స్మిత్ (9) నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ రెండు వికెట్లు తీశాడు. శివమ్ మావి, సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్ తలో వికెట్ తీశారు.(IPL2022 KKR Vs PBKS)
IPL 2022: డివిలియర్స్ రికార్డుకు సమం చేసిన ఎంఎస్ ధోనీ
కోల్ కతా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. షెల్డన్ జాక్సన్ ప్లేసులో శివమ్ మావి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్… తన ఆరంభ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ పై ఘనవిజయం సాధించి శుభారంభం చేసింది. అయితే అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఊహించని విధంగా విఫలమై ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు తొలి మ్యాచ్ లోనే పటిష్ట బెంగళూరును జట్టును ఓడించిన పంజాబ్ కింగ్స్ మరో విజయంపై కన్నేసింది.
IPL 2022: ధోనీ లాగా దినేశ్ కార్తీక్ చాలా కూల్ అంటోన్న ఆర్సీబీ కెప్టెన్
ఇక ముఖాముఖి పోరులో కేకేఆర్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేకేఆర్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు 29 మ్యాచులు ఆడాయి. ఇందులో కేకేఆర్ 19 మ్యాచుల్లో విజయం సాధిస్తే… పంజాబ్ 10 మ్యాచుల్లో నెగ్గింది.
మరోవైపు ఐపీఎల్ లవర్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. స్టేడియం సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఏప్రిల్ 6 నుంచి జరగనున్న అన్ని మ్యాచులకు 50 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించనున్నారు.
IPL 2022: “ఒక్క ఇన్నింగ్స్‌తో బదోనీ సూపర్ స్టార్ అయిపోడు”
‘టీ20 మెగా టోర్నీలో భాగంగా.. ఏప్రిల్ 6 నుంచి జరగనున్న అన్ని మ్యాచులకు 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్వహించుకునేందుకు బీసీసీఐ అనుమతించింది. అందుకు సంబంధించిన టికెట్లు ఈ రోజు నుంచే అందుబాటులో ఉంటాయి. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మరింత మంది క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచును చూసే వెసులుబాటు దొరికింది’ అని ‘బుక్ మై షో’ నిర్వాహకులు తెలిపారు.
టీ20 మెగా టోర్నీ 15వ సీజన్‌కు సంబంధించిన మ్యాచులన్నీ మహరాష్ట్రలోని వాంఖడే, బ్రాబౌర్న్, డీవై పాటిల్, ఎంసీఏ మైదానాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా కారణంగా తొలుత 25 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియాల్లోకి అనుమతించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. తాజాగా, ఏప్రిల్ 2 నుంచి అన్ని రకాల కరోనా నిబంధనలను ఎత్తివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.