IPL 2022: డివిలియర్స్ రికార్డుకు సమం చేసిన ఎంఎస్ ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్, మిస్టర్ 360 రికార్డు బ్రేక్ చేశాడు.

IPL 2022: డివిలియర్స్ రికార్డుకు సమం చేసిన ఎంఎస్ ధోనీ

Ms Dhoni

IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్, మిస్టర్ 360 రికార్డు బ్రేక్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆవేశ్ ఖాన్ 19వ ఓవర్లో వేసిన తొలి బంతికే సిక్సు బాదేశాడు.

19వ ఓవర్లో శివం దూబె హీరో బాదుడుతో 49పరుగులు చేసేశాడు. ఆ తర్వాత దిగిన ఎంఎస్ ధోనీ యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్ తొలి బంతికే సిక్సు బాదాడు. దాంతో డివిలియర్స్ రికార్డ్ సమం చేశాడు. ధోనీ, డివిలియర్స్ 19వ ఓవర్లో 36సిక్సులు బాదేశారు. ఇన్నింగ్స్ లో తొలి బంతికే సిక్సు బాదడం ధోనీకిదే తొలిసారి.

ఐపీఎల్ 19వ ఓవర్లో అధిక సిక్సులు బాదిన ప్లేయర్లు
ఎంఎస్ ధోనీ – 36
డివిలియర్స్ – 36
ఆండ్రీ రస్సెల్ – 26
కీరన్ పొలార్డ్ – 24
హార్దిక్ పాండ్యా – 24

Read Also: ధోనీతో పోటీ పడాలనుకుంటున్నా – హార్దిక్ పాండ్యా

లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ లో 19వ ఓవర్‌ను శివమ్‌ దూబేతో వేయించిన చెన్నై ఎత్తుగడ చిత్తయింది. రెండు వైడ్లతో సహా 8 బంతులేసిన దూబే ఏకంగా 25 పరుగులిచ్చాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ 6వికెట్ల తేడాతో ఓడిపోయింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఎవిన్‌ లూయీస్‌ (23 బంతుల్లో 55 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూపర్‌ షాట్లతో విజయాన్ని ఖాయం చేశాడు.