Tokyo Olympics: ఫిజియోథెరఫిస్ట్ కావాలనడం నేరమా: వినేశ్ ఫోగట్

ఇండియన్ రెజ్లర్.. టోక్యో ఒలింపిక్స్ పతకం తీసుకొస్తుందనే అంచనాల్లో ఉన్న వినేశ్ ఫోగట్ కాస్త కోపంగానే ట్వీట్ చేశారు. తనతో పాటు టోక్యో ఒలింపిక్స్ కు ఫిజియోథెరఫిస్ట్ ను తీసుకెళ్లనీయకపోవడంపై ఫైర్ అయ్యారు.

Tokyo Olympics: ఫిజియోథెరఫిస్ట్ కావాలనడం నేరమా: వినేశ్ ఫోగట్

Vinesh Phogat

Updated On : July 23, 2021 / 11:20 AM IST

Tokyo Olympics: ఇండియన్ రెజ్లర్.. టోక్యో ఒలింపిక్స్ పతకం తీసుకొస్తుందనే అంచనాల్లో ఉన్న వినేశ్ ఫోగట్ కాస్త కోపంగానే ట్వీట్ చేశారు. తనతో పాటు టోక్యో ఒలింపిక్స్ కు ఫిజియోథెరఫిస్ట్ ను తీసుకెళ్లనీయకపోవడంపై ఫైర్ అయ్యారు. గురువారం చేసిన ఈ ట్వీట్ పై స్పందించిన ఆమె.. తీసుకెళ్తానని అడగడం నేరమా..

నలుగురు మహిళా రెజ్లర్లు పర్యటనకు వెళ్తున్నప్పుడు ఒక్క ఫిజియోథెరఫిస్టును అడగడం తప్పెలా అవుతుంది. ఒక్క అథ్లెట్ కోసం మల్టిపుల్ కోచ్ లు, స్టాఫ్ ఉన్న సందర్భాలు లేవా అని ప్రశ్నించారు. బ్యాలెన్స్ ఎక్కడ ఉంది. చాలా కాలం నుంచి ఫిజియో కావాలని అడుగుతుంటే ఈ క్షణం వరకూ నియమించలేకపోయారు.

ఫోగట్ మహిళా ఫ్రీ స్టైల్ 53కేజీల కేటగిరీలో ఆగష్టు 5న తన తొలి మ్యాచ్ ఆడనున్నారు. 2016 రియో ఒలింపిక్స్ లో మోకాలి గాయంతో చాలా ఇబ్బందిపడ్డారు. క్వార్టర్ ఫైనల్స్ లో జరిగిన ప్రమాదం తర్వాత కెరీర్ పై అనుమానాలు మొదలయ్యాయి.

సర్జరీ జరుగుతున్న సమయంలో, ఆ తర్వాత ఐదు నెలల పాటు ఫోగట్ రెస్ట్ తీసుకున్నారు. అలా పట్టుదలతో పికప్ అయి 2018వ సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2019లో మూడో స్థానంలో ముగించారు.