Isa Guha Apologises: జస్ర్పీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పిన వ్యాఖ్యాత ఇషా గుహ.. ఎందుకంటే?

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఇషా గుహ టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టులో

Isa Guha Jasprit Bumrah

Isa Guha Apologises To Jasprit Bumrah: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఇషా గుహ టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టులో మూడోరోజు ఆట ప్రారంభం సమయంలో ఆమె క్షమాపణలు చెప్పారు. ఆమె క్షమాపణలు చెప్పడంపై టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించారు. లైవ్ టెలికాస్ట్ లో క్షమాపణలు చెప్పడం అద్భుతం. నువ్వు ధైర్యవంతురాలివి అంటూ ప్రశంసించారు. ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ లో కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ, వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగాలని రవిశాస్త్రి తెలిపారు.

Also Read: IND vs AUS: మూడో టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్.. బుమ్రాకు 6 వికెట్లు

క్షమాపణ ఎందుకు చెప్పిందంటే?
ఇషా గుహా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. గబ్బా మైదానం వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. రెండోరోజు ఆటలో ఆస్ట్రేలియా దూకుడుగా ఆడుతూ భారీ స్కోర్ చేసింది. అయితే, టీమిండియా బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా ఒక్కడే ఆస్ట్రేలియా బ్యాటర్లను అవుట్ చేయడంలో సఫలమయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ బుమ్రాపై ప్రశంసలు జల్లు కురిపించాడు. అతని వ్యాఖ్యలకు ప్రతిస్పందనంగా ఇసా గుహ సైతం బుమ్రాను కొనియాడుతూ నోరు జారింది. ‘మోస్ట్ వాల్యుబుల్ ప్రిమేట్’ అనే పదం వాడింది. అది చింపాజీ క్యారెక్టర్ తో ఆంగ్ల హాస్య చిత్రం. దీంతో సోషల్ మీడియాలో గుహ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లువెత్తాయి.

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియా బ్యాటర్లు హిట్.. మనోళ్లు ఏం చేస్తారో..! గబ్బాలో ముగిసిన రెండోరోజు ఆట

ఇషా గుహ మాట్లాడుతూ..
‘‘నిన్న మ్యాచ్ సమయంలో కామెంట్రీ చేస్తూ ఓ పదం వాడాను. కానీ, అది విపరీత అర్థాలకు దారితీసింది. ఎవరినైనా బాధిస్తే క్షమాపణలు చెబుతున్నా. నేను మాట్లాడిన మొత్తం మాటలు వింటే.. బుమ్రాపై ప్రశంసలు కురిపించానని మీకే తెలుస్తుంది. బుమ్రా విషయంలో అతడు సాధించిన అద్భుతాలను ప్రశంసించే క్రమంలో పొరపాటు పదం వాడినట్లు అనుకుంటున్నా. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా.’’ అంటూ ఇషా గుహ అన్నారు.