james anderson ఖాతాలో @600 వికెట్లు

ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్ లో 600 వికెట్లు పడగొట్టాడు. ఇతనే తొలి పేస్ బౌలర్. పాక్ తో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం డ్రాగా ముగిసింది.
ఇప్పటి వరకు అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్ల జాబతాలో తొలి స్థానంలో ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు, శ్రీలంక), రెండో ప్లేస్ లో షేన్ వార్న్ (708 వికెట్లు, ఆస్ట్రేలియా), మూడో స్థానంలో అనిల్ కుంబ్లే ( 619 వికెట్లు, భారత్) ఉన్నారు. వీరందరూ స్పిన్లర్లే అనే విషయం తెలిసిందే.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే..తొలుత వర్షంతో అంతరాయం కలిగింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో చివరి రోజు రెండు సెషన్‌లలో ఆట సాధ్యపడలేదు. అందరి చూపు అండర్సన్ వైపు నెలకొంది. 600 వికెట్లు సాధించిన ఘనత ఇతనికి దక్కుతుందా ? అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
టీ విరామం అనంతరం మ్యాచ్ ప్రారంభమైంది. అండర్సన్ బౌలింగ్ ప్రారంభించాడు. 14వ బంతికి వికెట్ దక్కింది. పాకిస్తాన్ కెప్టెన్ అజహర్ అలీ (31; 2 ఫోర్లు) ఇచ్చిన క్యాచ్‌ను ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ స్లిప్‌లో అందుకోవడంతో అండర్సన్ ఖాతాలో 600వ వికెట్ చేరింది.
https://10tv.in/corona-infected-with-brazil-president-jair-bolsanaro/
చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 100/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ 27.1 ఓవర్లు ఆడి మరో 87 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. పాక్ స్కోరు 187/4 వద్ద ఉన్నపుడు మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ‘డ్రా’గా ప్రకటించారు. మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 1 – 0తో సొంతం చేసుకుంది. జాక్ క్రాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’… జాస్ బట్లర్, రిజ్వాన్ సంయుక్తంగా ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు గెల్చుకున్నారు.