Jasprit Bumrah: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో జస్ర్పీత్ బుమ్రా అరుదైన ఘనత..

రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాటర్లను టీమిండియా బౌలర్లు జస్ర్పీత్ బుమ్రా, సిరాజ్ హడలెత్తించారు. నిప్పులు చెరిగే బంతులతో ఇద్దరు బౌలర్లు

Jasprit Bumrah: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో జస్ర్పీత్ బుమ్రా అరుదైన ఘనత..

Jasprit Bumrah

Updated On : December 29, 2024 / 10:05 AM IST

IND vs AUS 4th Test: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. జస్ర్పీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్ తో ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. ఫలితంగా 91 పరుగులకే ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయింది. బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో బుమ్రా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అదరుగైన ఘనతను సాధించాడు.

Jasprit Bumrah

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాల్గో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 474 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులు చేసింది. టీమిండియా ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాడు. నితీశ్ అద్భుత ఆటతీరుతో భారత్ జట్టు ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది. మూడో రోజు ఆట పూర్తయ్యే సరికి భారత్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. నాల్గో రోజు ఆటలో కొద్ది నిమిషాల్లోనే నితీశ్ కుమార్ రెడ్డి (114) ఔట్ కాగా.. భారత్ జట్టు 369 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 105 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

Jasprit Bumrah

రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాటర్లను టీమిండియా బౌలర్లు జస్ర్పీత్ బుమ్రా, సిరాజ్ హడలెత్తించారు. నిప్పులు చెరిగే బంతులతో ఇద్దరు బౌలర్లు రెచ్చిపోటంతో కంగారూ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు. జస్ర్పీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. దీంతో నాలుగో రోజు టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ 49 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 135 వద్ద ఉంది. దీంతో ఆసీస్ ఆధిక్యం 250 పరుగులకు చేరింది.

Jasprit Bumrah

మెల్ బోర్న్ టెస్టులో ఆసీస్ బ్యాటర్లను హడలెత్తిస్తూ పెవిలియన్ బాట పట్టించిన టీమిండియా జస్ర్పీత్ బుమ్రా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్ గా బుమ్రా నిలిచాడు. ట్రావిస్ హెడ్ ను ఔట్ చేసిన తరువా బుమ్రా ఈ ఘనత సాధించాడు. కెరీర్ లో 44వ టెస్టు ఆడుతున్న బుమ్రా కేవలం 8,484 బంతుల్లో 200 ప్లస్ వికెట్ల మార్క్ ను అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో బుమ్రా నాల్గో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాక్ మాజీ పేసర్ వకార్ యూనిస్ ఉన్నాడు. అతను 7,725 బంతుల్లోనే 200 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా పేసర్లు డేల్ స్టెయిన్ 7,848, కగిసో రబాడ 8,153 తరువాత స్థానాల్లో ఉన్నారు.