Jasprit Bumrah
Jasprit Bumrah : ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య కటక్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో ఆ ఘనత సాధించిన భారత తొలి బౌలర్‌గా నిలిచాడు.
Also Read : IND vs SA T20 : దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. వారిపై కెప్టెన్ సూర్యకుమార్ ప్రశంసలు.. అందుకే గెలిచాం..
టీమిండియా స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. తద్వారా మూడు ఫార్మాట్లలోనూ 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బుమ్రా ఈ ఘనత సాధించాడు.
సఫారీ జట్టు డేంజరస్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ (22)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడం ద్వారా టీ20 ఫార్మాట్లో 100 వికెట్లను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 69 టీ20 మ్యాచ్‌లలో 107 పడగొట్టి టీ20ల్లో వంద వికెట్లు తీసిన తొలి భారత్ బౌలర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
JASPRIT BUMRAH COMPLETES 100 T20I WICKETS. pic.twitter.com/wGnRGBYwvT
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 9, 2025
ఇప్పటికే టెస్టులు, వన్డేల్లో 100 వికెట్లు చొప్పున పడగొట్టి ఘనత సాధించిన బుమ్రా.. సఫారీ జట్టుపై తొలి టీ20 మ్యాచ్ ద్వారా టీ20ల్లోనూ సెంచరీ వికెట్ల క్లబ్‌లో అడుగు పెట్టాడు. బుమ్రాకు ఇది 81వ టీ20 మ్యాచ్. అయితే, 52 టెస్టులు ఆడిన అతను 234 వికెట్లు తీశాడు.. 89 వన్డేల్లో 149 వికెట్లు తీశాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లోనూ 100 వికెట్ల క్లబ్‌లో చేరిపోయాడు.
అయితే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఫార్మాట్లో 100 చొప్పున వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రాది ఐదో ప్లేస్. అంతకుముందు లసిత్ మలింగ, షకీబ్ అల్ హసన్, టీమ్ సౌథీ, షాహిన్ అఫ్రిది మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. వారు టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో వంద వికెట్ల చొప్పున పడగొట్టారు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్న ఐదో బౌలర్‌గా జస్ర్పీత్ బుమ్రా రికార్డు నెలకొల్పాడు. టీమిండియా తరుపున ఈ మైలురాయిని చేరుకుంది మాత్రం బుమ్రానే తొలి బౌలర్.