IND vs SA T20 : దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. వారిపై కెప్టెన్ సూర్యకుమార్ ప్రశంసలు.. అందుకే గెలిచాం..
India vs South Africa 1st T20 : భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య కటక్‌లోని బారాబతి స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 101 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై విజయం సాధించింది.
Suryakumar Yadav
India vs South Africa 1st T20 : ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య కటక్‌లోని బారాబతి స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ అయింది.
మ్యాచ్ విజయం తరువాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు. టాస్ సమయంలో మ్యాచ్ గెలిచే అవకాశాలు ఇరు జట్లకు సమానంగా ఉంటాయని నేను చెప్పాను. కానీ, మేము మొదట బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. 48 బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయిన తరువాత పుంజుకొని 175 పరుగులు చేయడం గొప్ప విషయం. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేసిన విధానం.. తిలక్ వర్మ బ్యాటింగ్, చివరిలో జితేశ్ వచ్చి తన పాత్రను పోషించాడు. వీరు చేసిన స్కోర్‌తో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగాం.
‘‘జట్టులో 7 నుంచి 8 మంది బ్యాట్స్‌మెన్ ఉన్నప్పుడు, కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు ఇన్నింగ్స్‌ను నడిపించరు.. కానీ, మిగిలిన నలుగురు బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకుంటారు. ఈ మ్యాచ్‌లో వారు సరిగ్గా అలాగే చేశారు. బహుశా తదుపరి మ్యాచ్‌లో మరొకరు బాధ్యత వహిస్తారు కావచ్చు.. టీ20 క్రికెట్ అంటేనే ఇలా ఉంటుంది. అయితే, ప్రతిఒక్కరం నిర్భయంగా ఆడుతూ బ్యాటింగ్‌ను ఆస్వాదించాలని మేము కోరుకుంటున్నాం’’ అని సూర్య అన్నాడు.
THE WINNING MOMENT 🇮🇳
HARDIK PANDYA IS THE HERO – Lowest Score in South African T20I History. pic.twitter.com/QB3LYbpPvS
— Johns. (@CricCrazyJohns) December 9, 2025
భారత జట్టు బౌలర్లపైన సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ‘‘టీమిండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అర్ష్‌దీప్, బుమ్రా కొత్త బంతితో ఆటను ప్రారంభించడానికి సరైన బౌలర్లు. దక్షిణాప్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నప్పుడు అర్ష్‌దీప్, బుమ్రా కొత్త బంతితో బౌలింగ్ చేసిన విధానం వారిని మంచి ఎంపికగా మార్చింది. హార్దిక్ గాయం నుంచి తిరిగి వచ్చాడు కాబట్టి అతన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
JASPRIT BUMRAH COMPLETES 100 T20I WICKETS. pic.twitter.com/wGnRGBYwvT
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 9, 2025
భారత బ్యాటింగ్‌లో పేలవమైన ఆరంభం ఉన్నప్పటికీ భారీ స్కోర్ సాధించినందుకు సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్లను ప్రశంసించాడు. తొలుత 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయాం. 7 నుంచి 15 ఓవర్ల మధ్యలో 90 పరుగుల మధ్య చేసి.. చివరి ఐదు ఓవర్లలో 40 నుంచి 44 పరుగులు చేసి 175 పరుగులు సాధించడం నిజంగా ప్రశంసనీయం. మేము బౌలింగ్ చేసిన విధానం, మాకు ఉన్న ఎంపికలను పరిశీలిస్తే 175 మంచి స్కోర్ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
