Jorich van Schalkwyk : వైభవ్ సూర్యవంశీవి మాటలే.. చేతల్లో చూపించిన దక్షిణాఫ్రికా చిచ్చరపిడుగు.. వామ్మో ఏమా కొట్టుడు సామీ..
దక్షిణాఫ్రికాకు చెందిన జోరిచ్ వాన్ షాక్‌విక్ అరుదైన ఘనత సాధించాడు.

Jorich van Schalkwyk beats Vaibhav Suryavanshi to first ever 200 in a Youth ODI
దక్షిణాఫ్రికాకు చెందిన జోరిచ్ వాన్ షాక్‌విక్ అరుదైన ఘనత సాధించాడు. యూత్ వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేలో జరుగుతున్న ట్రైనేషన్ అండర్ 19 టోర్నమెంట్‌లో జింబాబ్వే అండర్ 19 జట్టుపై అతడు ఈ అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు.
18 ఏళ్ల ఈ యువ ఆటగాడు కేవలం 153 బంతుల్లో 19 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 215 పరుగులు సాధించాడు. జోరిచ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా 385 పరుగులు చేసింది. యూత్ వన్డే క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక స్కోరు.
కాగా.. యూత్ వన్డేలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా జోరిచ్ వాన్ షాక్‌విక్ నిలిచాడు. ఈ క్రమంలో అతడు శ్రీలంకకు చెందిన హసిథా బోయాగొడ ను అధిగమించాడు. హసిథా బోయాగోడ 2018లో కెన్యాపై 191 పరుగులు చేశాడు.
టీమ్ఇండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ యూత్ క్రికెట్‌లో 200 పరుగుల మైలురాయిని చేరుకోవాలనే తన కోరికను వ్యక్తం చేసిన కొద్ది రోజులకే జోరిచ్ వాన్ షాక్‌విక్ దీన్ని చేరుకోవడం గమనార్హం.
Joe root : 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో జోరూట్ సంచలనం.. టెండూల్కర్ ఒక్కడే మిగిలాడు..
కాగా.. కొద్ది రోజుల క్రితమే జోరిచ్ వాన్ షాక్‌విక్ బంగ్గాదేశ్‌తో జరిగిన యూత్ వన్డేలో 164 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా తరుపున యూత్ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును నెలకొల్పాడు. డబుల్ సెంచరీ దిశగా దూసుకువెలుతుండగా వర్షం అంతరాయం కలిగించడంతో అతడి అవకాశం చేజారింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 14 పరుగుల తేడాతో గెలుపొందింది.