Kane Williamson : బాబోయ్.. కేన్ విలియమ్సన్ వీరబాదుడు.. టెస్టుల్లో సరికొత్త రికార్డు

న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భీరకర ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. టెస్టు క్రికెట్ లో వరుసగా సెంచరీలు నమోదు చేస్తున్నాడు.

Kane Williamson : బాబోయ్.. కేన్ విలియమ్సన్ వీరబాదుడు.. టెస్టుల్లో సరికొత్త రికార్డు

Kane Williamson

Updated On : February 16, 2024 / 9:44 AM IST

Kane Williamson : న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భీరకర ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. టెస్టు క్రికెట్ లో వరుసగా సెంచరీలు నమోదు చేస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండో టెస్టు సిరీస్ లో భాగంగా నాల్గోరోజు ఆటలో విలియమ్సన్ సెంచరీ చేశాడు. గత నాలుగు ఇన్నింగ్స్ లలో విలియమ్సన్ మూడు సెంచరీలు చేయడం గమనార్హం. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 118, రెండో ఇన్నింగ్స్ లో 109 పరుగులు చేశాడు. దీంతో టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు కొట్టిన ఐదో న్యూజిలాండ్ బ్యాటర్ గా నిలిచాడు. విలియమ్సన్ గడిచిన 12 ఇన్నింగ్స్ లో ఏకంగా 7 సెంచరీలు చేయడం గమనార్హం.

Also Read : CV Anand : ఇప్ప‌టికే ఐదు సంవ‌త్స‌రాలు లేటైంది.. స‌ర్ఫరాజ్ ఖాన్ అరంగ్రేటంపై ఐపీఎస్ ఆఫీస‌ర్ సీవీఆనంద్‌

కేన్ విలియమన్స్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో తాజా సెంచరీతో 32 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. తద్వారా టెస్టుల్లో అత్యంత వేగంగా 32 సెంచరీలు చేసిన ప్లేయర్ గా స్టీవ్ స్మిత్ రికార్డును విలియమ్సన్ బద్దలు కొట్టాడు. స్టీవ్ స్మిత్ 174 ఇన్నింగ్స్ లలో 32 సెంచరీలు పూర్తిచేయగా.. విలియమ్సన్ 172 ఇన్నింగ్స్ లలోనే ఈ ఘనత సాధించాడు. మూడో స్థానంలో రికీ పాటింగ్ (176 ఇన్నింగ్స్), నాల్గో స్థానంలో సచిన్ టెండూల్కర్ (179ఇన్నింగ్స్), ఐదో స్థానంలో యూనిస్ ఖాన్ (183 ఇన్నింగ్స్) కొనసాగుతున్నారు.