Kapil Dev : బీసీసీఐకి క‌పిల్‌ లేఖ‌.. మా మొత్తం పెన్ష‌న్‌ ఇస్తాం.. గైక్వాడ్‌కు సాయం చేయండి

టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు అన్షుమాన్ గైక్వాడ్ బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నాడు.

Kapil Dev Writes To BCCI Ready To Donate Pension For Ailing Anshuman Gaekwad

టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు అన్షుమాన్ గైక్వాడ్ బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నాడు. 71 ఏళ్ల ఈ మాజీ ఆట‌గాడు లండ‌న్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిట‌ల్‌లో ఏడాది కాలంగా చికిత్స పొందుతున్నాడు. అత‌డికి ఆర్థిక సాయం చేయాల‌ని భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని టీమ్ఇండియాకు మొద‌టి ప్ర‌పంచ‌క‌ప్‌ను అందించిన క‌పిల్ దేవ్ కోరాడు.

మొహిందర్ అమర్‌నాథ్, సునీల్ గవాస్కర్ , సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్, మదన్ లాల్, రవిశాస్త్రి,కీర్తి ఆజాద్ వంటి అత‌డి మాజీ సహచరులు గైక్వాడ్ చికిత్స కోసం నిధులు సమకూర్చడానికి తమ వంతు కృషి చేస్తున్నారని కపిల్ వెల్లడించాడు. త‌న విన్న‌పాన్ని బీసీసీఐ పరిశీలించి.. భారత మాజీ ప్రధాన కోచ్ గైక్వాడ్‌కు ఆర్థిక సహాయం చేస్తుందన్న నమ్మకం త‌న‌కు ఉంద‌ని క‌పిల్ వెల్ల‌డించాడు.

Riyan Parag : హార్దిక్ పాండ్యాతో న‌టి అన‌న్య పాండే డ్యాన్స్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న రియాన్ ప‌రాగ్‌..? మీమ్స్ వైర‌ల్‌

‘అన్షుమాన్ గైక్వాడ్‌తో క‌లిసి నేను క్రికెట్ ఆడాను. అత‌డిని ఇలా చూస్తుంటే చాలా బాధ‌గా ఉంది. త‌ట్టుకోలేక‌పోతున్నాను. మిగిలిన వారు కూడా బాధ‌ప‌డుతున్నారు. అయితే.. ఎవ‌రూ బాధ ప‌డాల్సిన ప‌ని లేదు. బోర్డు అత‌డిని చూసుకుంటుంద‌న్న న‌మ్మ‌కం నాకు ఉంది. మేము ఎవ‌రిని బ‌ల‌వంతం చేయ‌డం లేదు. అన్షుమాన్ కు సాయం చేయాల‌నేది మీ హృద‌యాల్లోంచే రావాలి. క్రికెట్ ఫ్యాన్స్ అత‌డిని పోగొట్టుకోరు అని అనుకుంటున్నా. ‘అత‌డు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించాలి అని కపిల్ దేవ్ అన్నాడు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న మాజీ ఆట‌గాళ్లకు సాయం చేసే వ్య‌వ‌స్థ లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నాడు. అన్షుమాన్ ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుపడకపోతే తన పెన్షన్ వదులుకోవడానికి కూడా సిద్ధమని కపిల్ చెప్పాడు. ‘ఈ త‌రం ఆట‌గాళ్లు బాగా డ‌బ్బు సంపాదిస్తున్నారు. ఇది గొప్ప విష‌యం. స‌హాయ‌క సిబ్బందికి కూడా మంచి జీతం ఇవ్వం బాగుంది. అయితే.. మాజీ ఆట‌గాళ్ల‌ను ఆదుకునేందుకు ఓ వ్య‌వ‌స్థ లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. మా కాలంలో బీసీసీఐ వ‌ద్ద డ‌బ్బు లేదు.’ అని క‌పిల్ తెలిపారు.

IND vs PAK : భార‌త్‌, పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. రాత్రి 9 గంట‌ల‌కే.. ఎక్క‌డ చూడొచ్చ‌డంటే..?

మాజీ ఆట‌గాళ్ల‌తో పాటు ప్ర‌స్తుత ఆట‌గాళ్ల‌కు ర‌క్షించేందుకు ఓ వ్య‌వ‌స్థ ఉంటే బాగుంటుందన్నారు. ఎవ‌రైనా విరాళాలు ఇవ్వ‌డానికి ముందుకు వ‌స్తే ఎవ‌రికి ఇవ్వాలో తెలియ‌దని, ఇందుకు ఒక న‌మ్మ‌క‌మైన ట్ర‌స్ట్ ఉంటే బాగుంటుందని చెప్పారు. దీన్ని బీసీసీఐ చేయ‌గ‌ల‌దన్నారు. మా కుటుంబం అనుమ‌తి ఇస్తే మా పెన్ష‌న్ మొత్తాన్ని విరాళంగా ఇవ్వ‌డానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని క‌పిల్ అన్నారు.

అన్షుమాన్‌ గైక్వాడ్‌ 1974- 87 మధ్య టీమ్ఇండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. ఆ త‌రువాత భార‌త జ‌ట్టుకు రెండు సార్లు ప్ర‌ధాన కోచ్‌గా ప‌నిచేశారు. 1997-99 మధ్య కాలంలో ఒకసారి కోచ్‌గా వ్యవహరించాడు. తర్వాత ఇతడు కోచ్‌గా ఉన్న సమయంలోనే 2000 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది.

Shubman Gill Sister : పాపం గిల్‌..! స్నేహితుడు అని న‌మ్మితే.. టీమ్ఇండియా స్టార్ క్రికెట్‌తో గిల్ సోద‌రి ప్రేమ‌..?

ట్రెండింగ్ వార్తలు