Karun Nair returns to Karnataka ahead of the 2025 domestic season
టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2025-26 దేశీయ సీజన్‌కు ముందు తన సొంత జట్టు కర్ణాటకకు తిరిగి వచ్చాడు. రెండు సీజన్ల పాటు విదర్భకు ప్రాతినిథ్యం వహించిన ఈ ఆటగాడు.. ఆ జట్టుకు గుడ్ బై చెప్పేశాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
2022లో కర్ణాటక జట్టులో చోటు కోల్పోయాడు కరుణ్ నాయర్. దీంతో విదర్భ తరుపున తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. రెండు (2023, 2024) సీజన్లలో విదర్భ తరుపున అద్భుతంగా రాణించాడు.
ముఖ్యంగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ ప్రదర్శన అమోఘం. 16 ఇన్నింగ్స్‌ల్లో 53.93 సగటుతో 863 పరుగులు చేశాడు. విదర్భను ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత విజయ్ హజారే ట్రోఫీలో 779 రన్స్ సాధించాడు.
ఈ ప్రదర్శనలతో 8 ఏళ్ల తరువాత టీమ్ఇండియా టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. రీ ఎంట్రీలో అతడు ఆశించిన విధంగా రాణించలేదు. మూడు టెస్టుల్లో 6 ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 131 పరుగులు మాత్రమే చేశాడు.
ENG vs IND : భారత్‌తో నాలుగో టెస్టు.. రూట్ గనుక 31 పరుగులు చేస్తే..
జూలై 23 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ 1-2 తేడాతో సిరీస్‌లో వెనుకబడి ఉంది. ఈ సమయంలో నాలుగో టెస్టులో భారత తుది జట్టులో కరుణ్ నాయర్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అతడికి బదులుగా సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు.