Kashmir Cricket Bat: వరల్డ్ కప్‌లో మన బ్యాట్..! కశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్‌లకు పెరుగుతున్న క్రేజ్..
ఆర్‌జీ8 స్పోర్ట్స్ యాజమాని ఫౌజల్ కబీర్ మాట్లాడుతూ.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో ఆస్ట్రేలియాతో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యూఏఈకి చెందిన జునైద్ సిద్ధిఖీ కాశ్మీర్ విల్లో బ్యాట్‌తో 109 మీటర్ల పొడవైన సిక్స్ కొట్టడంతో..

Kashmir willow bats
Kashmir Willow Cricket Bat: కశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్‌లకు క్రేజ్ పెరుగుతోంది. వాటిని వినియోగించే అంతర్జాతీయ క్రికెటర్ల సంఖ్య పెరుగుతోంది. భారత్ వేదికగా ఈ ఏడాది చివరిలో జరిగే వన్డే ప్రపంచ కప్-2023కు (ICC ODI World Cup 2023) తొలిసారి ఈ బ్యాట్‌ను వినియోగించబోతున్నారు. 17మంది అంతర్జాతీయ క్రికెటర్లు కశ్మీర్ విల్లో బ్యాట్‌తో మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. కశ్మీర్‌లోని బ్యాట్ తయారీ సంస్థ ఆర్‌జీ8 స్పోర్ట్స్ ఈ బ్యాట్లను తయారు చేస్తుంది. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని సంగమ్ ప్రాంతంలో ఉన్న ఆర్‌జీ8 స్పోర్ట్స్, బ్యాట్‌ల తయారీ సంస్థ శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లకు కశ్మీర్ విల్లో బ్యాట్‌లను సరఫరా చేయనున్నట్లు ఆర్‌జీ8 స్పోర్ట్స్ యజమాని ఫౌజల్ కబీర్ ధృవీకరించారు.

Kashmir willow bats
ఇటీవల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ కోసం జింబాబ్వే వేదికగా జరిగిన మ్యాచ్‌లలో యూఏఈ, వెస్టిండీస్, ఒమన్ ఆటగాళ్లు కూడా ఈ కశ్మీర్ విల్లో బ్యాట్‌లను వినియోగించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ అయిన కశ్మీర్ విల్లో బ్యాట్ లకు ఒమన్, యుఏఈకి చెందిన అంతర్జాతీయ క్రికెటర్లు టీ20 వరల్డ్ లో కాశ్మీర్ విల్లో బ్యాట్లను వినియోగించడంతో గ్లోబల్ మార్కెట్‌లో ఈ బ్యాట్లకు డిమాండ్ పెరిగింది. గత రెండేళ్లలో దాదాపు 1.85 లక్షల కంటే ఎక్కువ కాశ్మీర్ విల్లో బ్యాట్లను క్రికెట్ ఆడే దేశాలకు ఎగుమతి అయ్యాయి.

Kashmir willow bats
ఆర్‌జీ8 స్పోర్ట్స్ యాజమాని ఫౌజల్ కబీర్ మాట్లాడుతూ.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో ఆస్ట్రేలియాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యూఏఈకి చెందిన జునైద్ సిద్ధిఖీ కశ్మీర్ విల్లో బ్యాట్‌తో 109 మీటర్ల పొడవైన సిక్స్ కొట్టడంతో క్రికెట్ ప్రపంచంలో ఈ బ్యాట్లకు డిమాండ్ పెరిగిందని కబీర్ అన్నారు. అయితే, భారత్ దేశంలో ఈ ఏడాది చివరిలో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో తొలిసారి ఈ బ్యాట్‌తో అంతర్జాతీయ క్రికెటర్లు పలువురు ఆడబోతున్నారని చెప్పారు.