Katherine Sciver Brunt: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన ఇంగ్లాండ్ స్టార్ బౌల‌ర్‌

ఇంగ్లాండ్‌కు చెందిన పేస‌ర్ కేథరీన్ స్కివర్ బ్రంట్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. 2004లో అరంగ్రేటం చేసిన స్కివ‌ర్ శుక్ర‌వారం అంత‌ర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Katherine Sciver Brunt: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన ఇంగ్లాండ్ స్టార్ బౌల‌ర్‌

Katherine Sciver Brunt retirement

Updated On : May 5, 2023 / 6:38 PM IST

Katherine Sciver Brunt: ఇంగ్లాండ్‌కు చెందిన పేస‌ర్ కేథరీన్ స్కివర్ బ్రంట్(Katherine Sciver Brunt) అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. 2004లో అరంగ్రేటం చేసిన స్కివ‌ర్ శుక్ర‌వారం అంత‌ర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 19 ఏళ్ల కెరీర్‌లో ఆమె ఎన్నో ఘ‌న‌త‌ల‌ను అందుకుంది. వ‌న్డేల్లో, టీ20ల్లో ఇంగ్లాండ్ త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచింది. రెండు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు, ఓ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలుచుకున్న ఇంగ్లాండ్ జ‌ట్టులో ఆమె స‌భ్యురాలు.

IPL 2023, SRH Vs KKR: స‌న్‌రైజ‌ర్స్ కోచ్ బ్రియాన్ లారా కీల‌క‌ వ్యాఖ్య‌లు.. ‘కోల్‌క‌తా ఓడించ‌లేదు.. మేమే ఓడిపోయాం’

ఇంగ్లాండ్ జ‌ట్టు త‌రుపున అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 267 మ్యాచుల్లో 335 వికెట్లు ప‌డ‌గొట్టింది. 14 టెస్టుల్లో 51 వికెట్లు, 141 వ‌న్డేల్లో 170 వికెట్లు, 112 టీ20ల్లో 114 వికెట్లు తీసింది. 37 ఏళ్ల‌ కేథరీన్ స్కివర్ బ్రంట్ టెస్టుల్లో మూడు సార్లు, వ‌న్డేల్లో ఐదు సార్లు 5 వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. పేస్ బౌలింగే కాకుండా లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో ఉప‌యుక్త‌మైన బ్యాట‌ర్ కూడా. కెరీర్‌లో వ‌న్డేల్లో రెండు హాఫ్ సెంచ‌రీలు, టెస్టుల్లో ఓ అర్ధ‌శ‌త‌కం త‌న పేరిట ఉన్నాయి. చివ‌రి సారిగా ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్ త‌రుపున ఆడింది. 2022 మేలో త‌న స‌హ‌చ‌ర క్రికెట‌ర్ అయిన నాట్ స్కీవ‌ర్‌ను పెళ్లి చేసుకుంది.

England cricketers Nat Sciver and Katherine Brunt tie the knot

England cricketers Nat Sciver and Katherine Brunt tie the knot

Virat Kohli: కోచ్‌ను విరాట్ కోహ్లి అలా మోసం చేసేవాడ‌ట‌.. ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పిన చిన్న‌నాటి ఫ్రెండ్‌

“నా కెరీర్‌లో నేను తీసుకున్న అత్యంత క‌ఠిన‌మైన నిర్ణ‌యం ఇదే. ఈ నిర్ణ‌యాన్ని తీసుకోవ‌ద్దు అని అనుకున్నాను. కానీ త‌ప్ప‌లేదు. నేను చేసిన పనిని చేయాలనే కలలు లేదా ఆకాంక్షలు నాకు ఎప్పుడూ లేవు, నా కుటుంబం నా గురించి గర్వపడేలా చేయాలని మాత్రమే నేను కోరుకున్నాను. ఇంగ్లాండ్ జ‌ట్టుకు ఇంతకాలం ప్రాతినిధ్యం గొప్ప గౌర‌వంగా బావిస్తున్నా. నా కెరీర్‌లో నాకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌త్యేక‌మైన ధ‌న్యవాదాలు తెలియ‌జేస్తున్నా. నా అస‌లైన ఆనందం నాట్ స్కీవ‌ర్‌. త‌నే నేను క‌నుగొన్న గొప్ప విజ‌యం.” అని కేథరీన్ స్కివర్ అన్న‌ది.