పీటర్సన్‌కు స్మార్ట్ కౌంటర్ ఇచ్చిన కోహ్లీ

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ పాత మిత్రుడైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై చేసిన కామెంట్‌కు అంతే స్మార్ట్‌గా బదులిచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున గతంలో ఆడిన సాన్నిహిత్యంతో ట్విట్టర్‍లో సరదాగా ఓ కామెంట్ పెట్టాడు. సోషల్ మీడియా వేదికగా తరచూ అభిమానులతో టచ్‌లో ఉండే కోహ్లీ ట్విట్టర్‌లో ఓ ఫొటోను పంచుకున్నాడు. ఎండలో కూర్చుని మొహం మీద మాత్రమే ఎండపడుతున్న ఫొటోను పోస్టు చేసి దాని కింద.. సూర్యరశ్మిని దాచుకుంటున్నా. అని కామెంట్ చేశాడు.
దానిపై స్పందించిన పీటర్సన్.. నాకెందుకో నువ్వు పూర్తిగా షేడ్‌లో ఉండిపోయినట్లు అనిపిస్తుంది. అని కామెంట్ చేశాడు. బదులుగా కోహ్లీ అవునవును దాంతో పాటు నువ్వు కింద పెట్టిన క్యాప్షన్ కూడా చూస్తే బాగుండేదని సమాదానమిచ్చాడు. చివరిగా దానికి బదులిచ్చిన పీటర్సన్ అందుకే నువ్వంటే నాకిష్టం’ అనే కామెంట్‌తో ముగించాడు.
వీరిద్దరి సంభాషణ అభిమానులకు ఆసక్తి రేకెత్తించడంతో ట్విట్టర్ వేదికగా ఆ ట్వీట్లపై చర్చించుకుంటున్నారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీసేన తొలి వన్డే విజయానంతరం రెండో వన్డేలోనూ అదే ఫలితాన్ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.