Virat Kohli Shares Pic
Virat Kohli Shares Pic: చాలా కాలంగా మెరుగైన ఆటతీరు కనబర్చలేకపోతుండడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఇటీవల అఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచులో సెంచరీ సాధించడంతో ఖుషీ అవుతున్నాడు. తాజాగా, అతడు తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో తన చిన్న నాటి ఫొటోను పోస్ట్ చేశాడు. అందులో కోహ్లీ ఏవో తింటూ కనపడ్డాడు. దీనికి కోహ్లీ… ‘తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.. కానీ, మరొకరి భావాలను నొప్పించేలా ప్రవర్తించకండి’’ అని పేర్కొన్నాడు.
కోహ్లీ పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కోహ్లీ దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దాదాపు మూడేళ్ల పాటు సెంచరీ చేయని విరాట్ కోహ్లీ మళ్ళీ ఇన్నాళ్లకు శతకం బాదడంతో అతడి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఒకవేళ ఇటీవల జరిగిన మ్యాచులో సెంచరీ చేయలేకపోతే ఇప్పుడు ఇంత హుషారుగా ట్వీట్ చేయలేకపోయేవాడని కొందరు కామెంట్లు చేశారు. కాగా, 53 బంతుల్లోనే సెంచరీ కొట్టిన కోహ్లీ ఇదే ఫాం కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Wireless Current : ఇకపై వైర్‌లెస్ కరెంట్!