Wireless Current : ఇకపై వైర్‌లెస్ కరెంట్!
వైర్ లెస్ కరెంట్ ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అవును నిజంగానే త్వరలో వైర్‌లెస్ కరెంటు కూడా మన ఇంట్లోకి రావొచ్చు. తాజాగా దక్షిణ కొరియాలోని సెజాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక బృందం ఓ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. 30 మీటర్ల దూరం దాకా ఇన్‌ఫ్రారెడ్ కాంతిని ఉపయోగించి వైర్‌లెస్‌గా విద్యుత్తును ప్రసరింపజేసింది.

Wireless Current మనం ఇప్పటివరకు వైర్‌లెస్ ఇంటర్నెట్ గురించి విన్నాం.. కానీ, ఇకపై వైర్‌లెస్ కరెంట్ కూడా రాబోతుంది. వైర్లు లేకుండా కరెంట్ సరఫరా ఊహించగలమా? అయితే వైర్ లెస్ కరెంట్ ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అవును నిజంగానే త్వరలో వైర్‌లెస్ కరెంటు కూడా మన ఇంట్లోకి రావొచ్చు. తాజాగా దక్షిణ కొరియాలోని సెజాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక బృందం ఓ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
30 మీటర్ల దూరం దాకా ఇన్‌ఫ్రారెడ్ కాంతిని ఉపయోగించి వైర్‌లెస్‌గా విద్యుత్తును ప్రసరింపజేసింది. 400 మిల్లీ వాట్ల విద్యుత్తును సురక్షితంగా ప్రసరింపజేసి ఎల్‌ఈడీ లైటు వెలిగేలా చేశారు. ట్రాన్స్‌మీటర్, రిసీవర్ ద్వారా ఈ విద్యుత్తు సరఫరా జరిగినప్పుడు ఏదైనా ఆటంకం కలిగితే వెంటనే వ్యవస్థ మొత్తం పవర్ సేఫ్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.
దీంతో ఎలాంటి అపాయాలు జరుగకుండా చూస్తుందన్న మాట. ఈ సాంకేతికత ద్వారా స్మార్ట్ హోమ్స్ లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఇంటర్నెట్ ద్వారా పనిచేసే పరికరాలు)కు విద్యుత్తును అందించే అవకాశం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.