iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ఆగయా.. ఈ పాత ఐఫోన్ మోడల్స్ ధరలు తగ్గుతాయి.. కానీ ఇవి దొరకవు.. ఫుల్ లిస్ట్ ఇదిగో..!
iPhone 17 Series Launch : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ తర్వాత ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ తయారీని నిలిపివేస్తుంది.

iPhone 17 Series Launch
iPhone 17 Series Launch : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వచ్చేసింది. ఈ కొత్త వేరియంట్ మల్టీ అప్‌గ్రేడ్‌లతో గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆపిల్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ గత ఏడాదిలో సెప్టెంబర్ 9, 2024న లాంచ్ అయ్యాయి.
ఈ ఐఫోన్ 16, ఐఫోన్ 15 మోడళ్లు 8GB ర్యామ్, ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్‌తో వచ్చాయి. ఫోటోగ్రఫీ పరంగా ఐఫోన్లలో (iPhone 17 Series) కెమెరా కంట్రోల్ బటన్ కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ధరల విషయానికొస్తే.. ఐఫోన్ 16 ప్రో 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 1,19,900 ధర ఉండగా, ఐఫోన్ 16 ప్రో మాక్స్ 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 1,44,900 ధరకు భారత మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్ లాంచ్ తర్వాత ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ రెండు ఐఫోన్ల ధరలు భారీగా తగ్గుతాయి. కంపెనీ ఈ ఐఫోన్ మోడళ్ల ధరలను తగ్గిస్తుంది. అంతేకాదు.. ఐఫోన్ 17 సిరీస్ సేల్ తర్వాత ఈ ఐఫోన్ 16, ఐఫోన్ 15 బేస్, ప్లస్ వేరియంట్ ధరలు భారీగా తగ్గుతాయి. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్ తయారీని నిలిపివేయనుంది.
- ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్
- ఆపిల్ ఐఫోన్ 16 ప్రో
- ఆపిల్ ఐఫోన్ 15
- ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్
ఐఫోన్ 17 ప్రో లైనప్‌లో మార్పులేంటి? :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ లోగో రీపోజిషనింగ్, దీర్ఘచతురస్రాకార కెమెరా ఐలాండ్‌తో సరికొత్త డిజైన్‌ను తీసుకువచ్చాయి. ఆపిల్ గత సిరీస్‌లో వాడిన 12MP టెలిఫోటో సెన్సార్‌ను కూడా తొలగించింది.
ఆ స్థానంలో పవర్ ఫుల్ 48MP టెలిఫోటో సెన్సార్‌ను అందించింది. అదనంగా, రెండు ఐఫోన్‌లు 256GB బేస్ స్టోరేజీతో ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్ కలిగి ఉన్నాయి. కొత్త ఐఫోన్లు మునుపటి లైనప్‌తో పోలిస్తే.. భారీ అప్‌గ్రేడ్ కలిగి ఉన్నాయి.
ధర విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,34,900కు కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,49,900కు కొనుగోలు చేయవచ్చు.