IPL 2023, SRH Vs KKR: సన్‌రైజర్స్ కోచ్ బ్రియాన్ లారా కీలక వ్యాఖ్యలు.. ‘కోల్‌కతా ఓడించలేదు.. మేమే ఓడిపోయాం’
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ బ్రియాన్ లారా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.బ్యాటర్లు చేసిన తప్పిదాల వల్లనే ఓడిపోయినట్లు అంగీకరించాడు.

The Game Was In Our Hands And We Lost The Game Brian Lara
IPL 2023, SRH Vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ప్రయాణం ఏమంత గొప్పగా లేదు. తొమ్మిది మ్యాచులు ఆడితే కేవలం మూడు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచుల్లో సైతం చేజేతుగా ఓటమిని కొని తెచ్చుకుంటుంది. గురువారం ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచులో సైతం ఇదే విధంగా ఓడిపోయింది.
కోల్‌కతాతో మ్యాచ్‌లో 172 పరుగుల ఛేదనలో పవర్-ప్లేలో మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత హెన్రిచ్ క్లాసెన్, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు 47 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యంతో నెలకొల్పడంతో మ్యాచ్ హైదరాబాద్ వైపు మొగ్గు చూపింది. అయితే.. విజయం అంచు వరకు వచ్చి ఆఖర్లో బోల్తాపడింది.
IPL 2023, SRH vs KKR: ఉప్పల్‌లో హైదరాబాద్‌కు మరో ఓటమి.. కోల్‌కతా గెలుపు
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడంపై ఆ జట్టు హెడ్ కోచ్ బ్రియాన్ లారా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ గెలవాల్సి ఉందని అయితే బ్యాటర్లు చేసిన తప్పిదాల వల్లనే ఓడిపోయినట్లు అంగీకరించాడు. “పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోతున్నాం. దీంతో తరువాత పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి. క్లాసెన్ అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే అతడు మరింత బాధ్యత తీసుకోవాల్సి ఉంది. మిగతా బ్యాటర్లు సైతం తమ బాధ్యతలను గుర్తించి ఆడాలి. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ కుర్రాళ్లు చేతులెత్తేశారు.
ఇలాంటి మ్యాచుల్లో విజయం సాధించాలంటే భాగస్వామ్యాలు నిర్మించడం ఎంతో ముఖ్యం. అయితే అలా చేయలేకపోయాం. దూకుడుగా ఆడడం మంచిదే అయితే.. అన్నిసార్లు అది పనిచేయదు. మ్యాచ్ పరిస్థితులను అర్ధం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో వారు(కోల్‌కతా) మమ్మలి ఓడించలేదు. మేమే చేజేతులా ఓడిపోయాం” అని లారా అన్నాడు.
IPL 2023: కేకేఆర్ జట్టులోకి వెస్టిండీస్ ప్లేయర్ జాన్సన్ చార్లెస్..
ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఫామ్ కూడా హైదరాబాద్‌ను దెబ్బతీసింది. అతను టోర్నమెంట్‌లో వరుసగా రెండవసారి డకౌట్ అయ్యాడు. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతాపై సెంచరీని తప్పిస్తే అతడు పెద్దగా ఆడింది లేదు. అయితే అతడు నెట్స్‌లో చాలా కష్టపడుతున్నాడు. హ్యారీ తొందరగానే ఫామ్ అందుకుంటాడని ఆశిస్తున్నాం. అతడు ఫామ్‌లోకి వస్తే జట్టుకు అది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని బావిస్తున్నట్లు లారా చెప్పాడు.
ఐపీఎల్ 2023లో హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారం సాయంత్రం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.