KKR part ways with head coach Chandrakant Pandit
ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పేలవ ప్రదర్శన చేసింది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ కేవలం 5 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 8వ స్థానంతో సీజన్‌ను ముగించింది. ఈ క్రమంలో జట్టులో మార్పులు చోటు చేసుకోవడం ఖాయమనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఐపీఎల్ 2026 ముందు కేకేఆర్ జట్టులో పెద్ద మార్పు చోటు చేసుకుంది. ఆ జట్టు ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ తన పదవికి రాజీనామా చేశాడు.
2022లో ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు బెండ్రన్ మెక్‌కల్లమ్ ప్రధాన కోచ్‌గా వెళ్లడంతో కేకేఆర్ హెడ్ కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ బాధ్యతలను చేపట్టాడు. అతడి మార్గనిర్దేశ్యంలో ఐపీఎల్ 2024 విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. మొత్తంగా పండిత్ పర్యవేక్షణలో కేకేఆర్ 42 మ్యాచ్‌లు ఆడిన ఆడగా 22 విజయాల్లో గెలిచింది. 18 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం లేలలేదు.
ENG vs IND : భారత్‌తో ఐదో టెస్టు.. వరల్డ్ రికార్డు సృష్టించేందుకు అతి చేరువలో జోరూట్..
We wish you the best for your future endeavours, Chandu Sir 🤗
PS: Once a Knight, always a Knight. Kolkata will always be your home 💜 pic.twitter.com/GF0LxX5fIz
— KolkataKnightRiders (@KKRiders) July 29, 2025
చంద్రకాంత్ పండిత్ రాజీనామా విషయాన్ని కేకేఆర్ తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. “కొత్త అవకాశాలను అన్వేషించాలని చంద్రకాంత్ పండిట్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన జట్టు హెడ్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పారు. ఆయన పర్యవేక్షణలో కేకేఆర్ ఐపీఎల్ 2024 విజేతగా నిలిచింది. ఈ విజయాన్ని అందించిన ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ధృఢమైన జట్టును నిర్మించడంలో ఎంతో సాయం చేశారు. ఆయన నాయకత్వం, క్రమశిక్షణ వంటివి జట్టుపై బలమైన ముద్రను వేశాయి. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఘనతలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాము.” అని కేకేఆర్ ట్వీట్ చేసింది.
కాగా.. అతడితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరోన్ కూడా జట్టును వీడుతాడని అంటున్నారు.
వెంకటేశ్ అయ్యర్‌కు భారీకు భారీ మొత్తం..
ఐపీఎల్ 2025 సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ జట్టు రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయ్యర్‌కు ఇంత ధర పెట్టడం వెనుక కోచ్ చంద్రకాంత్ పండిట్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. అతడు ఐపీఎల్ 2025 సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు.
అదే సమయంలో ఐపీఎల్ 2024 సీజన్‌లో జట్టును విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్‌ను మెగా వేలానికి విడిచిపెట్టారు. ఇంకా జట్టులో పండిట్ వల్ల ఆటగాళ్లు పలు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత కొందరు ఆటగాళ్లు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.