Gautam Gambhir : గంభీర్, ఓవల్ పిచ్ క్యురేటర్‌ల మధ్య గొడవ.. ఎట్టకేలకు మౌనం వీడిన టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్.. మొత్తం విషయాన్ని పూసగుచ్చినట్లు..
ఓవల్ మైదానంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ ల మధ్య గొడవ జరిగింది.

Sitanshu Kotak breaks silence on Gautam Gambhirs heated argument with oval pitch curator
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్ మొదలుకాకముందే ఓ పెద్ద దుమారం రేగింది. ఓవల్ మైదానంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ ల మధ్య గొడవ జరిగింది.
ఐదో టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో పిచ్‌కు 2.5 మీటర్ల దూరంలో ఉండాలని టీమ్ఇండియా సహాయక సిబ్బందికి మైదాన సిబ్బంది చెప్పారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన గంభీర్.. పిచ్ క్యురేటర్ ఫోర్టిస్‌తో వాదనకు దిగాడు.
WCL 2025 : యువీ, యూసఫ్, బిన్నీ మెరుపులు.. సెమీస్‌కు భారత్.. పాక్‌తో ఆడేనా?
మేము ఏం చేయాలో మీరు మాకు చెప్పకండి. ఏం చేయాలో మాకు తెలుసు. మీరు గ్రౌండ్స్‌మెన్స్‌లో ఒకరు మాత్రమే. అంతకు మించి ఇంకా ఏమీ కాదు అని ఫోర్టిస్‌కు వైపు వేలు చూపెడుతూ గంభీర్ అన్నాడు. దీంతో ఆగ్రహించిన ఫోర్టిస్.. ఈ విషయం గురించి మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. ఆ వెంటనే గంభీర్.. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో పో అంటూ మండిపడ్డాడు. ఆ తరువాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత పోర్టిస్‌కు భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ సర్ది చెప్పాడు. సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మేం ఫిర్యాదు చేయం.. సితాంశు కోటక్
ఈ ఘటనపై బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ స్పందించాడు. పిచ్‌కు 2.5 మీటర్ల దూరంలో ఉండాలని గ్రౌండ్ సిబ్బంది చెప్పడంతోనే గొడవ మొదలైందన్నాడు. ఈ విషయం పై తాము ఎలాంటి ఫిర్యాదు చేయమని చెప్పాడు. ఇక్కడ భారత జట్టు ఆటగాళ్లు స్పైక్స్ షూస్ వేసుకోలేదని, దీంతో పిచ్‌కు ఎలాంటి ముప్పు వాటిల్లే ప్రమాదం లేదన్నాడు.
ENG vs IND : ఐదో టెస్టుకు ఒక రోజు ముందు భారత్‌కు షాక్.. భయపడినట్లే జరిగింది..
ఓవల్‌కు రావడాని కన్నా ముందే.. ఇక్కడి క్యురేటర్‌తో అంత తేలిక కాదని జట్టులోని చాలా మంది ఆటగాళ్లకి తెలుసునన్నాడు. పిచ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అయితే.. మరీ ఇంతగా అవసరం లేదన్నాడు. గంభీర్ అనవసరంగా ఏమీ మాట్లాడడని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ జరగబోయే పిచ్‌ను చూసేందుకు గంభీర్ ప్రయత్నించాడని, తానతో పాటు మిగిలిన కోచ్‌లు అందరూ అక్కడే ఉన్నట్లు తెలిపాడు. మామూలు షూస్ వేసుకుని పిచ్‌ను చూడడం తప్పేమీ కాదన్నాడు.
తాము ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడామని, అక్కడ కూడా క్యురేటర్లతో మాట్లాడామని తెలిపాడు. పిచ్ పై ఉండే పచ్చికను ఎప్పుడు తొలగిస్తారు అని వారిని అడిగితే.. కొందరు సమాధానం చెప్పేవారని, ఒకవేళ వారికి సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదని, రేపు తీసుకుంటామని మాత్రమే చెప్పేవారన్నాడు. ఇలా మాత్రం ఎవ్వరూ అనలేదని, 2.5 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పడం విచిత్రంగా ఉందన్నాడు.