ENG vs IND : ఐదో టెస్టుకు ఒక రోజు ముందు భారత్‌కు షాక్.. భయపడినట్లే జరిగింది..
గురువారం లండన్‌లోని ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది

Jasprit Bumrah to miss Oval Test Akash Deep likely to replace him report
గురువారం లండన్‌లోని ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో 1-2 తేడాతో వెనుకబడి ఉన్న భారత్‌కు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఎంతో ముఖ్యం. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు.
అతడు వెన్నునొప్పితో బాధపడుతుండడం, వర్క్‌లోడ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ మెడికల్ టీమ్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఐదో టెస్టు మ్యాచ్‌కు అతడికి రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్ఇన్ఫో తెలిపింది అతడి స్థానంలో పేసర్ ఆకాశ్ దీప్ తుది జట్టులోకి రానున్నాడని వెల్లడించింది.
ENG vs IND : చివరి టెస్టులో భారత్ గెలిచి సిరీస్‌ను సమం చేస్తే.. ట్రోఫీని ఎవరు తీసుకుంటారు?
వాస్తవానికి ఈ సిరీస్ ఆరంభానికి ముందే జస్‌ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి టెస్టు, మూడో టెస్టు, ఐదో టెస్టు ఆడాలని బుమ్రా భావించాడు. దీంతో మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లోనే అతడికి విశ్రాంతి ఇవ్వాల్సి ఉంది. కానీ.. మ్యాచ్‌కు ముందు ఆకాశ్‌దీప్ గాయపడడం, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరిగా బుమ్రా నాలుగో టెస్టు మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా చాలా అసౌకర్యంగా కనిపించాడు. ఎప్పుడు 140 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసే బుమ్రా మాంచెస్టర్ లో మాత్రం ఎక్కువగా 120 నుంచి 135 కి.మీ మధ్య వేగంతోనే బౌలింగ్ చేశాడు. ఇది జట్టు పై గట్టి ప్రభావాన్నే చూపించింది. ఈ క్రమంలోనే ఐదో టెస్టు మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో బుమ్రా మూడు మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు తీశాడు.